వెనకాలే ఎలుగుబంటి.. ఆమె ఏం చేసిందంటే! | Bear Stands Up To Sniff Hiker She Takes Selfie Video Goes Viral | Sakshi
Sakshi News home page

వైరల్‌ వీడియో: దగ్గరకొచ్చి వాసన చూసి మరీ..!

Jul 21 2020 9:36 AM | Updated on Jul 21 2020 9:52 AM

Bear Stands Up To Sniff Hiker She Takes Selfie Video Goes Viral - Sakshi

ఎలుగుబంటిని చూస్తేనే భయంతో బిక్కచచ్చిపోయేవాళ్లు మనలో చాలా మందే ఉంటారు. ఇక అది దగ్గరికి వచ్చి, వెనకాలే నిల్చుని వాసన చూస్తే.. అమ్మో ఊహించుకుంటేనే ఒళ్లు జలదరిస్తోంది కదా! ఓ మహిళకు సరిగ్గా ఇలాంటి అనుభవమే ఎదురైంది. అయితే ఆమె ఏమాత్రం భయపడకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించింది. నిల్చున్న చోటే బొమ్మలా ఉండిపోయి.. ఎలుగుబంటితో సెల్ఫీ కూడా తీసుకుంది. అయితే కాసేపటికి మళ్లీ అది వెనక్కి వచ్చి కాళ్లను పామడంతో అక్కడి నుంచి మెల్లగా జారుకుంది. మెక్సికోలోని చినిక్‌ ఎకోలాజికల్‌ పార్కులో ఈ ఘటన చోటుచేసుకుంది. 

ఇందుకు సంబంధించిన వీడియోను ఎన్‌బీఏ మాజీ ఆటగాడు రెక్స్‌ చాప్‌మన్‌ ట్విటర్‌లో షేర్‌ చేశాడు. ఎలుగుబంటి అంత దగ్గరగా వచ్చినా ఏమాత్రం బెదరకుండా ధైర్యం ప్రదర్శించిన మహిళపై ప్రశంసలు కురిపించాడు. ఆమె నరాలు ఉక్కుతో తయారుచేశారేమో... అతడితో తను సెల్ఫీ తీసుకుందంటూ కొనియాడాడు. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ వీడియోను ఇప్పటికే లక్షలాది మంది వీక్షించారు. కాగా గతంలో ఇదే పార్కులో ఓ మహిళ దగ్గరకు వచ్చిన నల్ల ఎలుగు ఆమె తల నిమిరి, జుట్టును సరి చేసిన వీడియో సైతం ఇంటర్నెట్‌లో చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement