ఫ్రీ వైఫై.. జాగ్రత్త సుమా! | Be careful with free wifi | Sakshi
Sakshi News home page

ఫ్రీ వైఫై.. జాగ్రత్త సుమా!

Jul 20 2017 1:43 AM | Updated on Sep 5 2017 4:24 PM

ఫ్రీ వైఫై.. జాగ్రత్త సుమా!

ఫ్రీ వైఫై.. జాగ్రత్త సుమా!

ఎయిర్‌పోర్ట్‌.. రైల్వేస్టేషన్‌.. బస్టాండ్‌.. లాడ్జింగ్‌.. ఇలా ఎక్కడికెళ్లినా వెంటనే ఫ్రీ వైఫై కోసం వెతుకుతాం.

వ్యక్తిగత సమాచారం ఇతరులకు చేరే అవకాశం
ఎయిర్‌పోర్ట్‌.. రైల్వేస్టేషన్‌.. బస్టాండ్‌.. లాడ్జింగ్‌.. ఇలా ఎక్కడికెళ్లినా వెంటనే ఫ్రీ వైఫై కోసం వెతుకుతాం. వారు అడిగిన వివరాలు ఇచ్చి వెంటనే లాగిన్‌ అవుతాం. అయితే ఇలాంటి పబ్లిక్‌ వైఫైలతో చాలా సమస్యలు ఉన్నాయి. మీ వ్యక్తిగత సమాచారం ఇతరులకు చేరిపోయే ప్రమాదముంది. అయినా సరే.. ఉచితంగా వస్తే చాలు.. ఇలాంటి రిస్క్‌ను భరించేందుకు సిద్ధమే అనే వినియోగదారులు ఎక్కువేనట. చిత్రమైన విషయం ఏమిటంటే.. వీరిలో చాలామందికి ఇప్పటికీ సైబర్‌ సెక్యూరిటీ గురించి.. దాంతో వచ్చే సమస్యల గురించి తెలియకపోవడం. సైబర్‌ సెక్యూరిటీ సంస్థ నార్టన్‌ ఇటీవల పబ్లిక్‌ వైఫై వాడకం తీరుతెన్నులపై 15 దేశాల్లో విస్తృత సర్వే చేపట్టింది. పలు ఆసక్తికరమైన అంశాలను వెలుగులోకి తెచ్చిన ఈ సర్వే వివరాలు..
 
జాగ్రత్త పడండి
పబ్లిక్‌ వైఫై నెట్‌వర్క్‌ను ఉపయోగించేటప్పుడు ప్రజలు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని వ్యక్తిగత సమాచారం, ఫొటోలు, వీడియోలు పడరాని వారి చేతుల్లో పడితే కష్టాలు కొని తెచ్చుకున్నట్లేనని నార్టన్‌ సర్వే హెచ్చరిస్తోంది. సైమాంటిక్‌ అభివృద్ధి చేసిన వర్చువల్‌ ప్రైవేట్‌ నెట్‌వర్క్‌ ‘నార్టన్‌ వైఫై ప్రైవసీ’వంటివి వాడకం ద్వారా సమాచారాన్ని సురక్షితంగా ఉంచుకోవచ్చని సూచిస్తున్నారు. ఆన్‌లైన్‌ సెక్యూరిటీ కోసం వెబ్‌సైట్ల యూఆర్‌ఎల్‌లలో హెచ్‌టీటీపీఎస్‌ ప్రొటోకాల్‌ ఉందో.. లేదో.. చూసుకోవాలి. అయితే నెట్‌వర్క్‌ సురక్షితంగా లేకపోతే హెచ్‌టీటీపీఎస్‌ ఉన్నా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముంది. వైఫై నెట్‌వర్క్‌ ఆటోమేటిక్‌గా కనెక్టయ్యే ఆప్షన్స్‌ ఉంటే వాటిని వాడకపోవడమే మేలు.
 
సోషల్‌ మీడియాలో వ్యక్తిగత వివరాలు ఎడిట్‌ చేసేందుకూ అనుమతించే వారు 19%
పబ్లిక్‌ వైఫై ద్వారా బ్యాంక్‌ అకౌంట్లు చూసుకోవడం, ఫొటోలు షేర్‌ చేసుకునే వారు 96%
పబ్లిక్‌ వైఫై వాడినా తమ వివరాలకు వచ్చిన నష్టమేమీ లేదనుకునే భారతీయులు 74%
కొత్త చోటికి వెళితే వైఫైలోకి ప్రవేశించేందుకు నిమిషమూ నిలవలేని వారు 51%
వ్యక్తిగత ఈమెయిల్, కాంటాక్ట్స్‌ వివరాలు ఇచ్చేం దుకు సిద్ధంగా ఉన్న వారు 19%
వైఫైతో పోలిస్తే సురక్షితమైన వర్చువల్‌ ప్రైవేట్‌ నెట్‌వర్క్‌(వీపీఎన్‌)ను వాడే వారు 48%
పబ్లిక్‌ వైఫైతో అసభ్య చిత్రాలు, వీడియోలు చూసే వారు 31%

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement