ఒబామా ఇఫ్తార్ విందు | Barak obama to ifthar dinner for muslims | Sakshi
Sakshi News home page

ఒబామా ఇఫ్తార్ విందు

Jun 24 2015 2:19 AM | Updated on Sep 3 2017 4:15 AM

ఒబామా ఇఫ్తార్ విందు

ఒబామా ఇఫ్తార్ విందు

రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సోమవారం రాత్రి ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇచ్చారు.

వాషింగ్టన్: రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సోమవారం రాత్రి ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. వైట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ప్రముఖ అమెరికన్ ముస్లింలతోపాటు బంగ్లాదేశ్, పాకిస్తాన్‌తోసహా పలు ఇస్లామిక్ దేశాల దౌత్యవేత్తలు హాజరయ్యారు. ఏ మతానికి చెందిన వారినైనా లక్ష్యంగా చేసుకోవడాన్ని వ్యతిరేకించడంలో అమెరికన్లందరూ ఐక్యంగా నిలబడతారని ఒబామా పేర్కొన్నారు. అందరం కలసికట్టుగా అభివృద్ధి పథంలో పయనించడమే లక్ష్యంగా ముందుకెళుతూ.. ఖురాన్‌లో ప్రవచించిన శాంతి మంత్రాన్ని పాటించాలని కోరారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement