'ఎందుకు ఏడ్చానో.. నాకే ఆశ్చర్యంగా ఉంది' | Barack Obama Says He Was Himself Surprised By His Public Crying | Sakshi
Sakshi News home page

'ఎందుకు ఏడ్చానో.. నాకే ఆశ్చర్యంగా ఉంది'

Jan 8 2016 12:24 PM | Updated on Sep 3 2017 3:19 PM

'ఎందుకు ఏడ్చానో.. నాకే ఆశ్చర్యంగా ఉంది'

'ఎందుకు ఏడ్చానో.. నాకే ఆశ్చర్యంగా ఉంది'

గన్ కల్చర్ మూలంగా మృతి చెందిన అమాయక చిన్నారులను గుర్తుచేసుకొని పబ్లిక్గా కన్నీరు పెట్టుకున్న అమెరికా అధ్యక్షడు బరాక్ ఒబామా.. అలా ఏడ్వడం తనకే ఆశ్చర్యం కలిగించిందన్నారు.

వాషింగ్టన్: గన్ కల్చర్ కారణంగా మృతిచెందిన అమాయక చిన్నారులను గుర్తుచేసుకొని పబ్లిక్గా కన్నీరు పెట్టుకున్న అమెరికా అధ్యక్షడు బరాక్ ఒబామా.. తాను అలా ఏడవడం తనకే ఆశ్చర్యం కలిగించిందన్నారు.

అగ్రరాజ్య అధినేత దీనిపై మాట్లాడుతూ.. 'నేను అలా కన్నీరు పెట్టుకోవడం చాలామందికి ఆశ్చర్యం కలిగించి ఉంటుంది. అయితే నేను వాస్తవవికతతో ప్రవర్తిచాను. నేను ఇంతకుముందు చెప్పినట్లుగానే.. చిన్నారుల మరణం నన్ను నిత్యం వెంటాడుతూనే ఉంటుంది. నేను అధ్యక్షుడిగా గా ఉన్న కాలంలో  కనెక్టికట్లో చిన్నారుల కాల్చివేత ఘటన జరిగిన రోజే అత్యంత చెత్త రోజు' అన్నారు.

చిన్న చిన్న పిల్లలు కూడా దేశంలోని గన్ కల్చర్ కారణంగా బలి కావడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తన జీవితంలో ఎప్పుడూ తన వద్ద మాత్రం గన్ లేదని ఒబామా వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement