‘ట్రంప్‌.. ఓ ఫ్యాన్‌బాయ్‌లా ప్రవర్తించారు’

Arnold Schwarzenegger Slams Trump on Putin Meet - Sakshi

వాషింగ్టన్‌ : రెండు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా అమెరికా, రష్యాల అధ్యక్షులు డొనాల్డ్‌ ట్రంప్, వ్లాదిమిర్‌ పుతిన్‌లు ఫిన్లాండ్‌లోని హెల్సింకిలో సమావేశమైన విషయం తెలిసిందే. భేటీ అనంతరం ట్రంప్‌ మాట్లాడుతూ.. ‘ఇదొక మంచి ఆరంభమనుకుంటున్నా. అందరికీ చాలా చాలా మంచి ఆరంభం’ అని వ్యాఖ్యానించగా.. పుతిన్‌ కూడా ట్రంప్‌తో తన చర్చలు ‘చాలా విజయవంతంగా, ఉపయోగకరంగా’  సాగాయని తెలిపారు. అయితే పుతిన్‌తో ట్రంప్‌ భేటీ గురించి ప్రస్తావిస్తూ హాలీవుడ్‌ నటుడు, కాలిఫోర్నియా మాజీ సెనేటర్‌ ఆర్నాల్డ్‌ స్క్వార్జ్‌నెగ్గర్‌ ట్రంప్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

ఆటోగ్రాఫ్‌ కోసం వెళ్లారా...?
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ముందు.. ట్రంప్‌ ఓ ఫ్యాన్‌ బాయ్‌లా ప్రవర్తించారని ఆర్నాల్డ్‌ స్క్వార్జ్‌నెగ్గర్‌ విమర్శించారు. ‘ట్రంప్‌.. పుతిన్‌తో మీరు జరిపిన మంతనాలను చూశాను. చాలా ఇబ్బందిగా అనిపించింది. మీరక్కడ ఓ తడి నూడుల్‌లా నిల్చుని ఉన్నారు. మీ వాలకం చూస్తుంటే పుతిన్‌ ఆటోగ్రాఫ్‌ కోసమో, లేదా సెల్ఫీ దిగడానికో వెళ్లినట్లు ఉంది. సమావేశంలో భాగంగా అమెరికా కమ్యూనిటీని అమ్మేశారు. దేశం పరువు తీసేశారంటూ’ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ట్రంప్‌తో పాటు శ్వేత సౌధ ప్రతినిధుల తీరును కూడా ఆయన తప్పు పట్టారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top