హోస్టన్‌కు ఆపిల్‌ ఆర్థిక సాయం | Apple is pledging another $5 million for hurricane relief. | Sakshi
Sakshi News home page

హోస్టన్‌కు ఆపిల్‌ ఆర్థిక సాయం

Sep 9 2017 9:33 PM | Updated on Aug 20 2018 2:55 PM

హోస్టన్‌కు ఆపిల్‌ ఆర్థిక సాయం - Sakshi

హోస్టన్‌కు ఆపిల్‌ ఆర్థిక సాయం

వరుస హారికేన్లతో సతమతమౌతున్న హోస్టన్‌కు ప్రముఖ టెక్‌ దిగ్గజం ఆపిల్‌ హర్వీ, ఇర్మా తుఫాన్‌ బాధితులు సహాయార్థం ఆర్థిక సాయం ప్రకటించింది.

హోస్టన్‌: వరుస హారికేన్లతో సతమతమౌతున్న హోస్టన్‌కు ప్రముఖ టెక్‌ దిగ్గజం ఆపిల్‌ ఆర్థిక సాయం ప్రకటించింది. బాధితులకు సహాయమే లక్ష్యంగా పలు సంస్థల సహకారంతో "హ్యాండ్ ఇన్ హ్యాండ్"  పేరుతో విరాళాల సేకరణలో భాగంగా 5 మిలియన్‌ డాలర్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. అంతేకాకండా తమ వినియోగదారులు ఎవరైనా యాప్‌ స్టోర్‌ లేదా, ఐట్యూన్స్‌ ద్వారా నేరుగా విరాళం ఇవ్వచ్చొని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. రెడ్ క్రాస్‌కు మరో 3మిలియన్‌ డాలర్లను విరాళంగా ఇచ్చింది. ఆపిల్ ఉద్యోగులు, వినియోగదారుల ద్వారా మరో 2 మిలియన్‌ డాలర్లు ఇవ్వనున్నట్లు సంస్థ ప్రతినిధి తెలిపారు.

తొలుత "హ్యాండ్ ఇన్ హ్యాండ్"  కార్యక్రమాన్ని ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం వెరిజోన్. మైఖేల్ & సుసాన్ డెల్ ఫౌండేషన్‌లు ప్రారంభించారు. ఇందుకోసం మైఖేల్ డెల్ 5 మిలియన్లు డాలర్ల విరాళాన్ని ఇచ్చాడు. ఇందుకోసం వెరిజోన్ సైతం 2.5 మిలియన్‌ డాలర్లు ఆర్థిక సహాయం అందిండంతోపాటు ప్రత్యేక కాల్‌ సెంటర్‌ నడుపుతోంది. విరాళాల సేకరణకు సెప్టెంబర్ 12 న ప్రముఖులతో టెలిథాన్‌ నిర్వహించాలని "హ్యాండ్ ఇన్ హ్యాండ్"  నిర్వాహకులు ప్రణాళిక చేస్తున్నారు.

ఈ టెలీథాన్‌ను ప్రపంచ వ్యాప్తంగా ఏబీసీ, సీబీఎస్‌, ఫాక్స్‌, ఎన్‌బీసీ, హెచ్‌బీవీ టీవీ నెట్‌వర్క్‌లు ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి. ఈ కార్యక్రమంలో బెయోన్స్, ఓప్రా, జోన్ స్టివార్ట్, స్టీవెన్ కోల్బర్ట్, డ్రేక్, జార్జ్ క్లూనీలు పాల్గొంటారు. అంతేకాకుండా మ్యూజిక్‌ స్టార్‌ జార్జ్ స్ట్రైట్ షోకూడా ఏర్పాటు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement