ఆ గుహ నిండా మనుషుల ఎముకలే

Ancient Tomb With Skeletons Of 72 Members Found By Drone In Canary Islands - Sakshi

ఆఫ్రికా : స్పానిష్‌ కెనరీ ఐలాండ్‌లోని ఐలాండ్‌ ఆఫ్‌ గ్రాండ్‌ కెనరియాలో 8వ శతాబ్దానికి చెందిన ఓ రహస్య సమాధి గుహని పురావస్తు శాస్త్రవేత్తలు వెలుగులోకి తెచ్చారు. దాదాపు 1000 సంవత్సరాలు కనుమరుగై ఉన్న గుహని డ్రోన్‌ సహాయంతో వారు గుర్తించారు. ఈ గుహలో 72మంది మనుషులకు చెందిన ఎముకలు బయటపడ్డాయి. ఆ ఎముకలు 62 మంది మధ్య వయస్కులు, 10మంది చిన్నపిల్లలవిగా గుర్తించారు. వారంతా అప్పటి కెనరీ ఐలాండ్‌లో నివాసముంటున్న ‘గుంచె’ తెగకు చెందినవారిగా తేల్చారు. పురావస్తు శాస్త్రవేత్త ఆల్బర్టో మాట్లాడుతూ.. ‘గ్రాన్‌ కెనరియాలో ఎన్నో సమాధి గుహలు ఉన్నాయి. అయితే అన్నీ ఈ గుహలా మాత్రం లేవు. అప్పటి ‘గుంచె’ తెగవారు సమాధి వస్త్రాలను జంతువుల చర్మాలతో, కూరగాయల తోలుతో తయారు చేసేవారు. ఆ జాతి మొత్తం ఒకేరకమైన విధానాన్ని ఉపయోగించేవారు.

మేమిక్కడికి చేరుకోవటానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇక్కడికి చేరుకునే అవకాశం లేదు కనుక ముందుగా డ్రోన్‌ సహాయంతో దీన్ని అన్వేషించామ’ని తెలిపాడు. 2019 జూన్‌ చివర్లో ఈ గుహను కనుగొన్నప్పటికి గుహను ధ్వంసం, పాడు చేస్తారనే ఉద్దేశ్యంతో వివరాలను అధికారికంగా ప్రకటించలేదని ఓ ఔత్సాహిక పురావస్తు శాస్త్రవేత్త తెలిపాడు. అక్కడి అధికారుల సహాయంతో దాన్ని సంరక్షించుకోవాలనే ప్రస్తుతం గుహ విషయాలు బయటపెట్టామని చెప్పాడు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top