మరణ తేదీని చెప్పేందుకు ఓ యాప్!! | An app that could calculate your death day! | Sakshi
Sakshi News home page

మరణ తేదీని చెప్పేందుకు ఓ యాప్!!

Nov 3 2014 3:38 PM | Updated on Aug 20 2018 2:35 PM

మరణ తేదీని చెప్పేందుకు ఓ యాప్!! - Sakshi

మరణ తేదీని చెప్పేందుకు ఓ యాప్!!

మనిషికి తాను ఎంతకాలం బతుకుతానో.. ఎప్పుడు చనిపోతానో తెలుసుకోవాలన్న ఆసక్తి ఉండటం సర్వసాధారణం. కానీ అది తెలియడం అంత సులభం కాదనుకుంటున్నారా.. అయితే మీకోసం ఇదుగో, ఓ యాప్ సిద్ధంగా ఉంది.

మనిషికి తాను ఎంతకాలం బతుకుతానో.. ఎప్పుడు చనిపోతానో తెలుసుకోవాలన్న ఆసక్తి ఉండటం సర్వసాధారణం. కానీ అది తెలియడం అంత సులభం కాదనుకుంటున్నారా.. అయితే మీకోసం ఇదుగో, ఓ యాప్ సిద్ధంగా ఉంది. 'డెడ్లైన్' అనే ఈ యాప్.. మీ ఐఫోన్లో ఉన్న హెల్త్కిట్ టూల్ నుంచి సమాచారం మొత్తాన్ని స్కాన్ చేసి, మీరు ఏరోజు మరణిస్తారో చెప్పేస్తుంది. ఎత్తు, బీపీ, ఎంతసేపు పడుకుంటున్నారు, రోజుకు ఎంత నడుస్తున్నారు.. ఇలాంటి వివరాలన్నింటినీ ఈ యాప్ లెక్కకట్టేస్తుంది. ఈ సమాచారాన్ని ఉపయోగించి, దానికి మీ జీవనశైలికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు జోడించి.. వాటి సమాధానాల ద్వారా సుమారుగా మీ మరణ తేదీని చెబుతుంది.

వాస్తవానికి ఏ యాప్ కూడా కచ్చితంగా మనం మరణించే తేదీని చెప్పలేపదని, కానీ ఇది మాత్రం వాస్తవానికి మన ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసి అవసరమైన పక్షంలో వైద్యుడిని సంప్రదించాలని కూడా సూచిస్తుందని ఈ యాప్ను డెవలప్ చేసిన జిస్ట్ ఎల్ఎల్సీ సంస్థ యాపిల్ ఐట్యూన్స్ పేజీలో రాసింది. మంచి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, రోజూ తప్పనిసరిగా వ్యాయామం చేయడం ద్వారా మరణాన్ని వాయిదా వేసుకోవచ్చని కూడా అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement