'ఏం చేయాలో పాకిస్థానే డిసైడ్‌ చేసుకోవాలి'

All Options Open To Deal With Pakistan - Sakshi

వాషింగ్టన్‌ : పాకిస్థాన్‌ విషయంలో అమెరికా వైఖరి కఠినంగానే మారినట్లు మరోసారి స్పష్టమైంది. చాలాకాలంపాటు క్షేత్రస్థాయిలో పరిశీలనలు జరిపిన తర్వాతే పాక్‌పై అమెరికా ఒత్తిడిని నానాటికి పెంచుతున్నట్లు స్పష్టమవుతోంది. దీనికి తాజాగా మరోసారి వైట్‌ హౌస్‌ చేసిన ప్రకటనే సాక్ష్యంగా నిలుస్తోంది.

'పాకిస్థాన్‌ను డీల్‌ చేసే విషయంలో అన్ని రకాల ప్రత్యామ్నాయాలను మేం సిద్ధంగానే ఉంచుకున్నాం. తాలిబన్‌, హక్కానీ నెట్‌ వర్క్‌ విషయంలో పాక్‌ కఠినంగా ఉండకున్నా, వారి రక్షణ స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేయకున్నా మేం మా ప్రత్యామ్నాయాలను ఉపయోగిస్తాం. ఏం చేయాలో పాక్‌ డిసైడ్‌ చేసుకోవాలి' అంటూ వైట్‌ హౌస్‌ శనివారం ఓ ప్రకటన చేసింది. ఇప్పటికే పాక్‌ భద్రత కోసం ఏటా అమెరికా చేసే సాయం రెండు బిలియన్‌ డాలర్లను ఈసారి అమెరికా ఆపేసిన విషయం తెలిసిందే. పాక్‌ చెబుతున్నంత సంతృప్తి స్థాయిలో ఉగ్రవాద చర్యలను నిలువరించడం లేదనే కారణంతో ఆ దేశానికి నిధులు ఇవ్వడం ఆపేసింది. దానికి కొనసాగింపు అన్నట్లుగా తాజాగా పై హెచ్చరికను చేసింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top