వాయుసేన చీఫ్‌కు తప్పిన ముప్పు

Air Chief Marshal Bhadauria Safe After Pearl Harbour Shooting: IAF - Sakshi

అమెరికాలోని పెరల్‌ హార్బర్‌లో నావికుడు కాల్పులు

హోనోలులు: అమెరికా పర్యటనలో ఉన్న భారత్‌ ఎయిర్‌చీఫ్‌ మార్షల్‌ రాకేష్‌ భదౌరియాకు ముప్పు తప్పింది. హవాయి దీవుల్లోని పెరల్‌ హార్బర్‌లో బుధవారం ఇండో ఫసిఫిక్‌ ప్రాంతంలో భద్రతపై వివిధ దేశాల వైమానిక దళ మార్షల్స్‌ సదస్సులో ఆయన పాల్గొన్నారు. అదే సమయంలో ఒక నావికుడు పెరల్‌ హార్బర్‌లోకి చొరబడి కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఇద్దరు అమెరికన్లు మృతి చెందారు. కాల్పులు జరిపాక ఆ నావికుడు తనను షూట్‌చేసుకుని చనిపోయాడు. కాగా, భదౌరియా సురక్షితంగా ఉన్నారని భారత వైమానిక దళం వెల్లడించింది.

పెరల్‌ హార్బర్‌లో అమెరికా వైమానిక దళ కేంద్రంలో ఈ సదస్సు జరిగే సమయంలో దగ్గర్లోని నావికాదళ కేంద్రంలో కాల్పుల ఘటన జరిగిందని వాయుసేన అధికారి చెప్పారు. కాల్పులకు కారణాలు తెలియాల్సి ఉందని హవాయి ప్రాంత నావికా దళ కమాండర్‌ అడ్మిన్‌ రాబర్ట్‌ చెప్పారు. 1941 డిసెంబర్‌ 7న జపాన్‌ పెరల్‌ హార్బర్‌పై జరిపిన దాడికి 78ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో అక్కడ నివాళులరి్పంచడానికి ఏర్పాట్లు చేస్తుండగా ఈ కాల్పుల ఘటన జరగడంతో అమెరికాలోనూ కలకలం రేగింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top