breaking news
Pearl Harbor
-
ఉరుము లేని పిడుగు
1941 డిసెంబర్ 7న జపాన్ సైన్యం హవాయిలోని పెర్ల్ హార్బర్లో ఉన్న అమెరికా నౌకా స్థావరం పైన ఆకస్మికంగా దాడి జరిపింది. అసలు ఏ మాత్రం ఊహించని ఆ పరిణామంతో అమెరికా, రెండో ప్రపంచ యుద్ధంలోకి దిగక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి. డిసెంబర్ 8న, అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డెలానో రూజ్వెల్ట్ జపాన్ పై యుద్ధ ప్రకటన కోసం చట్ట సభ ‘కాంగ్రెస్’ ఆమోదం కోరారు. కాంగ్రెస్ వెంటనే సమ్మతించింది. అందుకు ప్రతిచర్యగా డిసెంబర్ 11న, జపాన్ తో పొత్తు ఉన్న జర్మనీ, ఇటలీ అమెరికాపై యుద్ధం ప్రకటించాయి. ఆ విధంగా అమెరికా పూర్తిస్థాయిలో రెండవ ప్రపంచ యుద్ధంలోకి ప్రవేశించవలసి వచ్చింది.స్నేహితులు శత్రువులయ్యారు!నిజానికి అమెరికా, జపాన్ ఒక జట్టులో ఉండి మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నాయి. పెర్ల్ హార్బర్‌పై దాడి కారణంగా రెండో ప్రపంచ యుద్ధంలో రెండూ పరస్పరం శత్రు దేశాలు అయ్యాయి. అసలెందుకు జపాన్ పెర్ల్ హార్బర్ నౌకా స్థావరంపై దాడి చేయవలసి వచ్చింది? ఆసియా, పసిఫిక్ ప్రాంతంలో సైనిక విస్తరణను నిలిపివేయాలని జపాన్ పై అమెరికా ఒత్తిడి తెస్తుండటమే అందుకు కారణం. పుస్తకం ఇచ్చిన ప్రేరణ!పెర్ల్ హార్బర్‌పై దాడి చేయాలన్న ఆలోచన మొదట వచ్చింది.. జపాన్ అడ్మిరల్ ‘ఇసోరోకు యమమోటో’కు. ఆ దాడికి పథక రచన చేసింది కెప్టెన్ మినోరు గెండా. యమమోటోకు ఆ ఆలోచన రావటానికి రెండు విషయాలు ప్రేరణనిచ్చాయి. ఒకటి : కాలజ్ఞాన గ్రంథం. రెండోది, అప్పటికి ఏడాది క్రితమే జరిగిన ఒక దాడి. యమమోటోకు ప్రేరణ కలిగించిన ఆ గ్రంథం పేరు ‘ది గ్రేట్ పసిఫిక్ వార్’. దానిని 1925లో బ్రిటిష్ నౌకాదళ అధికారి హెక్టర్ బైవాటర్ రాశారు. అందులోని కథాంశం, అమెరికా– జపాన్ల మధ్య ఘర్షణలు జరగడం. జపనీయులు యుఎస్ నౌకాదళాన్ని నాశనం చేయడంతో ఆ గ్రంథం ప్రారంభమై గువామ్ (పశ్చిమ పసిఫిక్ ప్రాంతం), ఫిలిప్పీన్స్ లపై జపాన్ దాడి చేయడం వరకు కొనసాగుతుంది. అలాగే, 1940 నవంబర్ 11న ఇటలీలోని టొరంటో నౌకాశ్రయంలో ఇటాలియన్ నౌకాదళంపై బ్రిటన్ రాయల్ వైమానిక దళం విజయవంతంగా దాడి చేయటం కూడా యమమోటోకు స్ఫూర్తిని ఇచ్చింది. దాడికి ఒక రోజు ముందు1941 డిసెంబర్ 6న పెర్ల్ హార్బర్లో ఓడల కదలికలు, మోహరింపు స్థానాల గురించి జపాన్ వివరాలు రాబడుతున్నట్లు అమెరికాకు సమాచారం అందింది. ఆ సమాచారాన్ని ఒక క్రిప్టాలజిస్ట్ తన ఉన్నతాధికారి అయిన మహిళా ఆఫీసర్‌కు చేరవేసి, తను డిసెంబర్ 8 సోమవారం వచ్చి కలుస్తానని చెప్పారు. ఆ మర్నాడు డిసెంబర్ 7 ఆదివారం... హవాయిలోని ఓహులో ద్వీపంలో ఒక రాడార్ ఆపరేటర్ తన కంప్యూటర్ స్క్రీన్‌పై... ద్వీపం మీదుగా వెళుతున్న పెద్ద విమానాల సమూహాన్ని చూశాడు. వెంటనే అతను ఆ విషయాన్ని తన ఉన్నతాధికారికి ఫోన్ చేసి చెప్పారు. అయితే ఆ అధికారి, ఆ విమానాలు ఆరోజు అక్కడికి రావాల్సిన యు.ఎస్. బి–17 బాంబర్ యుద్ధ విమానాలు అయి ఉండవచ్చని, వాటి గురించి ఆందోళ చెందాల్సిన పని లేదనీ చెప్పాడు. గంట 15 నిముషాల్లోనే!ఆ తర్వాత కొద్ది సేపటికే ఉదయం 7:55 గంటలకు పెర్ల్ హార్బర్‌పై జపాన్ దాడి ప్రారంభమైంది. ఆ మొత్తం దాడి కేవలం ఒక గంట 15 నిముషాల్లోనే పూర్తయింది. దానికి ముందు కెప్టెన్ మిట్సువో ఫుచిడా.. ఓహూలో ద్వీప గగన తలంలోకి రాగానే, ‘అమెరికా దిక్కుతోచని విధంగా మా చేతికి చిక్కింది’ అని చెప్పటానికి ‘టోరా, టోరా, టోరా’ అనే కోడ్ సందేశాన్ని జపాన్ నౌకాదళానికి పంపారు. నిజానికి 1907 నాటి హేగ్ సమావేశంలోని మొదటి నిబంధన ప్రకారం, దాడి ప్రారంభించే ముందు ఏ దేశమైనా ముందుగా యుద్ధ ప్రకటన చేయాలి. అయితే జపాన్ ఆ విషయాన్ని ముందస్తుగా వాషింగ్టన్‌లోని అమెరికా అధికారులకు తెలియబరచటానికి ముందే దాడి మొదలైపోయింది. దాంతో జపాన్ పెర్ల్ హార్బర్‌పై దొంగదాడి చేసినట్లయింది. విమానాల నుంచి విధ్వంసంపెర్ల్ హార్బర్‌పై జపాన్ దాడిలో నాలుగు వాహక నౌకల నుండి పైకి లేచిన 353 యుద్ధ విమానాలు పాల్గొన్నాయి. వాటిలో 40 టార్పెడో విమానాలు, 103 లెవల్ బాంబర్లు, 131 డైవ్–బాంబర్లు, 79 ఫైటర్ జెట్లు ఉన్నాయి. ఇంకా... రెండు భారీ క్రూజర్లు, 35 జలాంతర్గాములు, రెండు లైట్ క్రూజర్లు, తొమ్మిది ఆయిలర్లు, రెండు యుద్ధనౌకలు, 11 డిస్ట్రాయర్లు ఉన్నాయి. ఆ దాడిలో 68 మంది అమెరికన్ పౌరులు సహా 2,403 మంది అమెరికా సైనికులు మరణించారు. 8 యుద్ధనౌకలు సహా 19 యూఎస్ నేవీ నౌకలు ధ్వంసం అయ్యాయి. యూఎస్ పసిఫిక్ నౌకాదళానికి చెందిన మూడు విమాన వాహక నౌకలు దాడికి ముందే సముద్రంలోకి వెళ్లి ఉండటంతో జపాన్ సైన్యం వాటిని గుర్తించలేకపోయింది. డోరీ మిల్లర్ అసమాన శౌర్యంజపాన్ దాడిలో ‘యు.ఎస్.ఎస్. (యునైటెడ్ స్టేట్స్ షిప్) అరిజోనా యుద్ధనౌక’ సిబ్బంది సహా పాటుగా పసిఫిక్ మహా సముద్రంలో మునిగిపోయింది. పెర్ల్ హార్బర్ దాడిలో చనిపోయిన వారిలో సగం మంది అరిజోనా షిప్‌లోని వారే. మునిగిపోయిన యుద్ధనౌక పైన అమెరికా జెండా ఎగురుతూ ఉంది. ఆనాటి దాడిలో మరణించిన అమెరికన్ అమర వీరులకు స్మారక చిహ్నంగా ఆ జెండా నిలిచిపోయింది. యు.ఎస్.ఎస్. వెస్ట్ వర్జీనియా నౌక స్టీవార్డ్ డోరీ మిల్లర్, పెర్ల్ హార్బర్‌పై జపాన్ దాడి జరుపుతున్న సమయంలో కనబరచిన అసమాన ధైర్య సాహసాలు, విధి నిర్వహణ పట్ల ఆయన అంకిత భావం అమెరికాకు చిరస్మరణీయమైనవి. మొదట అతడు ప్రాణాంతకంగా గాయపడిన కెప్టెన్‌కు సహాయం అందించాడు. తరువాత మెషిన్‌గన్ తో రెండు జపాన్ విమానాలను ధ్వంసం చేశాడు. నిజానికి మెషిన్ గన్ని ఆపరేట్ చేయటం డోలీ మిల్లర్‌కు అదే మొదటిసారి. దాడి సమయంలో అతడు చూపిన తెగువకు, సమయస్ఫూర్తికి, సేవకు గుర్తింపుగా అమెరికా అత్యున్నత పురస్కారం ‘నేవీ క్రాస్’ లభించింది. ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ఆ నేవీ క్రాస్‌ను పొందిన మొదటి ఆఫ్రికన్ అమెరికన్ డోరీ మిల్లర్. జపాన్‌పై ప్రతీకార దాడులుపెర్ల్ హార్బర్ దాడిలో అమెరికా ప్రతిఘటనతో జపాన్ 29 విమానాలను, 5 చిన్న జలాంతర్గాములను కోల్పోయింది. ఒక జపాన్ సైనికుడు ఖైదీగా పట్టుబడ్డాడు. 129 మంది జపాన్ సైనికులు మరణించారు. పెర్ల్ హార్బర్‌పై దాడిలో పాల్గొన్న అన్ని జపాన్ నౌకలలో, ఉషియో అనే ఒక్క నౌక మాత్రమే చెక్కు చెదరకుండా బయటపడింది. దీనిని యోకోసుకా నౌకా స్థావరం వద్ద అమెరికా స్వాధీనం చేసుకుంది. కూటమి ధాటికి ఓటమిమొత్తానికి అమెరికా కోలుకుంది. అది కూడా జపాన్ ఊహించిన దాని కంటే త్వరగా! కేవలం ఆరు నెలల తర్వాత, 1942 జూన్ ఉత్తర పసిఫిక్ మహా సముద్రంలోని మిడ్వే ప్రాంతంలో అమెరికాకు చెందిన విమాన వాహక నౌకాదళం... యమమోటో నావికాదళానికి చెందిన నాలుగు జపాన్ విమాన వాహక నౌకలను ధ్వంసం చేసింది. ఈ మిడ్వే విజయం తర్వాత, 1945 సెప్టెంబరులో మూడో ప్రపంచ యుద్ధం ముగిసేనాటికి, ఒక నెల ముందు ఆగస్టులో అమెరికా, బ్రిటన్, చైనా, రష్యాల కూటమి ధాటికి జపాన్ సామ్రాజ్యం ఓటమి పాలైంది. సాక్షి, స్పెషల్ డెస్క్ -
ఆపరేషన్ స్పైడర్స్వెబ్...నయా పెరల్ హార్బర్!
నాటో దేశాలు నిరంతరం ఆయుధాలతో సహా సర్వ సామగ్రీ సమకూరుస్తుంటే తప్ప యుద్ధరంగంలో పూట గడవని పరిస్థితి ఉక్రెయిన్‌ది. అవతలున్నదేమో అపార సైనిక పాటవానికి మారుపేరైన రష్యా. అలాంటి అగ్రరాజ్యానికి చెందిన ఏకంగా 41 బాంబర్ విమానాలను ఏదో వీడియోగేమ్ ఆడుతున్నంత అలవోకగా దాని సొంతగడ్డ మీదే ధ్వంసం చేసిన తీరు ప్రపంచవ్యాప్తంగా పెను కలకలం సృష్టించింది. అది కూడా ఏ ఒక్కచోటో కాదు. రష్యావ్యాప్తంగా ఏకంగా మూడు టైమ్ జోన్లలో, ఏకంగా 6,000 కి.మీ. పరిధిలో ఉన్న ఐదు వైమానిక స్థావరాలపై ఏకకాలంలో విజయవంతంగా దాడులు జరగడం విశేషం. ఆ దెబ్బకు రష్యా బాంబర్ శ్రేణి విమానాల్లో మూడో వంతు తుడిచిపెట్టుకుపోయాయి! అత్యంత సంక్లిష్టమైన ఇంతటి ఆపరేషన్‌ను పూర్తి కచ్చితత్వంతో, కేవలం డ్రోన్ల సాయంతో కారుచౌకగా, తనవైపు ఎలాంటి ప్రాణనష్టమూ లేకుండా పూర్తి చేసిన వైనం రక్షణ నిపుణులనే విస్మయపరిచింది. ఆధునిక ప్రపంచ యుద్ధ చరిత్రలోనే అతి పెద్ద, అత్యంత సంక్లిష్టమైన సర్జికల్ స్ట్రైక్ ఇదేనని చెబుతున్నారు. అంతేగాక ఏ కోణం నుంచి చూసినా అత్యంత విజయవంతమైన దాడిగా కూడా ఇది నిలిచింది. రష్యా చరిత్రలో అతి పెద్ద నిఘా వైఫల్యంగా కూడా ఇదేనని చెబుతున్నారు. ఈ దాడులను తమ పాలిట ‘పెరల్ హార్బర్’ ఉదంతంగా రష్యా మీడియానే అభివర్ణిస్తోంది. రెండో ప్రపంచయుద్ధం చివర్లో హవాయిలోని పెరల్ హార్బర్‌పై జపాన్ మెరుపు దాడులకు దిగి అమెరికా యుద్ధనౌకలను సముద్రంలో ముంచేసింది. ఈ ఉదంతం అమెరికాను యుద్ధంలోకి లాగడమే గాక జర్మనీ, జపాన్ తదితర అక్షదేశాల ఓటమికి ప్రధాన కారణంగా నిలిచింది. ‘ఆపరేషన్ స్పైడర్స్వెబ్’ పేరిట ఉక్రెయిన్ జరిపిన డ్రోన్ దాడులు రష్యాను ఆ స్థాయిలో దెబ్బకొట్టాయని అక్కడి మీడియా వాపోతోంది. అది అక్షరాలా నిజమేనని రక్షణ నిపుణులు ముక్త కంఠంతో చెబుతున్నారు. ప్రపంచ దేశాలన్నీ ఆధునిక యుద్ధ వ్యూహాలను తక్షణం సమీక్షించుకోవాల్సిన అవసరాన్ని ఇది మరోసారి గుర్తు చేసిందని వారంటున్నారు.ఇంత భారీ ఆపరేషన్‌కు రష్యా గడ్డ మీద కూడా అవసరమైన మద్దతు తప్పనిసరి. ఇందుకోసం ఉక్రెయిన్ రష్యాలో ఏకంగా ఆఫీసే తెరిచింది! అది కూడా రష్యా అంతర్గత భద్రతా విభాగం ఎఫ్ఎస్బీ కార్యాలయం పక్కనేనని జెలెన్స్కీ వెల్లడించడం విశేషం. ఏ ప్రాంతంలో అన్నది మాత్రం చెప్పలేదు. → మొత్తం ఆపరేషన్‌ను ఉక్రెయిన్ సీక్రెట్ సరీ్వస్ (ఎస్‌బీయూ) పక్కాగా నిర్వహించింది.→ దీన్ని జెలెన్స్కీ ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. దాడి వెనక ఏడాదిన్నర ప్రణాళిక ఉన్నట్టు వెల్లడించారు. ‘‘రష్యా గడ్డ నుంచే ఎంతోమంది ఇందుకు తోడ్పడ్డారు. వారందరినీ దాడులకు ముందే సురక్షితంగా తరలించాం. మావైపు ప్రాణనష్టం లేకుండా రష్యాను చావుదెబ్బ తీశాం’’ అన్నారు. రష్యాపై మరిన్ని దాడులు తప్పవన్నారు.→ డ్రోన్ దాడుల అనంతరం రష్యా ప్రతీకార దాడుల్లో 12 మంది ఉక్రెయిన్ సైనికుల మృతికి బాధ్యత వహిస్తూ ఉక్రెయిన్ పదాతి దళాధిపతి మేజర్ జనరల్ మైకేలియో ద్రాపత్యు రాజీనామా చేశారు.ఎక్కడెక్కడ దాడులు... → ఒలెన్యా (ముర్మాన్స్క్ ), బెలయా (ఇర్కుట్స్క్ –సైబీరియా), ద్యాగిలెవొ (సెంట్రల్ ర్యాజాన్), ఇవనొవొ → ఉక్రెయిన్ సరిహద్దుల నుంచి బెలయా ఏకంగా 4,000 కి.మీ. దూరంలో ఉంటుంది! → వీటిలో ఒలెన్యా, బెలయా స్థావ రాల మధ్య దూరం ఏకంగా 6,000 కి.మీ.! ఇవి పరస్పరం మూడు టైమ్ జోన్ల దూరంలో ఉండటం విశేషం. → అమూర్, ఇవనోవో, ర్యాజన్ తదితర ప్రాంతాల్లోనూ డ్రోన్ దాడుల యత్నాలు జరిగాయని రష్యా ధ్రువీకరించింది.గతంలోనూ... మూడేళ్ల పై చిలుకు యద్ధంలో అనూహ్య, ఆకస్మిక దాడులతో రష్యాకు ఉక్రెయిన్ తీవ్ర నష్టం కలిగించడం ఇది తొలిసారేమీ కాదు. → 2022 ఏప్రిల్‌లో రష్యా యుద్ధనౌక మోస్క్ వాను నెప్ట్యూన్ యాంటీ షిప్ మిసైళ్లతో ఉక్రెయిన్ నల్లసముద్రంలో ముంచేసింది. ళీ 2022 అక్టోబర్‌లో ఆక్రమిత క్రిమియాను రష్యా భూభాగానికి కలిపే కీలక కెర్చ్ బ్రిడ్జిని బాంబులతో పేల్చేసింది. ళీ 2024 ఆగస్టులో ఉక్రెయిన్ సైన్యం తొలిసారిగా సరిహద్దులు దాటి రష్యా భూభాగంపై మెరుపు దాడులకు దిగి కుర్క్స్ ప్రాంతాన్ని స్వా«దీనం చేసుకుంది. తీరని అవమానం మిగిల్చిుంది!ట్రక్కుల్లో తరలించి...సింపుల్ ప్లానింగ్. పూర్తి గోప్యత. పక్కా రిహార్సల్స్. ఆకస్మిక దాడి. అమలులో మెరుపువేగం. 100 శాతం లక్ష్యసాధన. సర్జికల్ స్ట్రైక్స్ వంటి స్పెషల్ ఆపరేషన్స్ ఏ మేరకు సఫలమైందీ తేల్చేందుకు ప్రఖ్యాత సైనిక నిపుణుడు అడ్మిరల్ విలియనం మెక్రావెన్ సిద్ధాంతీకరించిన గీటురాళ్లు. వాటన్నింటినీ పూర్తిస్థాయిలో మేళవించిన ఆపరేషన్‌గా స్పైడర్స్ వెబ్ నిలిచింది. → మొత్తం ఆపరేషన్‌లో ఉక్రెయిన్ చాలావరకు పౌర మౌలిక సదుపాయాలనే వాడుకుంది. → ఇంతటి భారీ స్థాయి దాడులకు ప్రణాళిక రచించిన ఉక్రెయిన్, అందుకు సిద్ధం చేసిన డ్రోన్లను రష్యాలోకి తేలిగ్గా దొంగచాటుగా తరలించడం విశేషం. → అనంతరం వాటిని ట్రక్కుల్లో చెక్క కంటైనర్లలో పెట్టి ఎయిర్బేస్లకేసి తరలించారు. → ఒక్కో కంటైనర్‌లో 36 డ్రోన్లను ఉంచారు. వాటిని ప్రత్యేకంగా డిజైన్ చేశారు. → దాడుల్లో ఎక్కడా ప్రత్యక్షంగా సిబ్బందిని నియోగించే అవసరమే లేకుండా పకడ్బందీగా ముందస్తు ఏర్పాట్లు చేశారు. → ట్రక్కులను వైమానిక స్థావరాలకు అతి సమీపంలోకి తీసుకెళ్లారు. → అక్కడినుంచి నిర్ధారిత సమయంలో కంటైనర్ల పైకప్పును రిమోట్ ద్వారా తెరిచారు. → ఆ వెంటనే వాటిలోంచి డ్రోన్లు పైకెగిరి లక్ష్యాలపైకి దూసుకెళ్లాయి. సరిగ్గా విమానాలపై పడి పేలిపోయాయి. కంటైనర్ల నుంచి డ్రోన్లు పైకి ఎగురుతున్న దృశ్యాలతో కూడిన వీడియోలను రష్యా మీడియా విడుదల చేసింది. వాటిని అడ్డుకునేందుకు కొందరు సాయుధులు ట్రక్కులపైకి ఎక్కుతున్న దృశ్యాలు కూడా కొన్నింట్లో కనిపిస్తున్నాయి.కారుచౌకే.. కానీ ఖతర్నాక్ రష్యా ఎయిర్‌బేస్‌లపై దాడుల్లో ఉక్రెయిన్ వాడింది ఎఫ్‌పీవీ (ఫస్ట్ పర్సన్ వ్యూ) రకం డ్రోన్లు. → ఇవి కారుచౌకగా దొరుకుతాయి. పేలుడు పదార్థాలను బిగించి పంపగల ఒక్కో ఎఫ్‌పీవీ డ్రోన్ ఖరీదు కేవలం రూ.42 వేలు మాత్రమేనని రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది. → అయితే గురితప్పకుండా లక్ష్యాన్ని ఛేదించడంలో వీటికివే సాటి. → డ్రోన్‌కు అమర్చిన కెమెరా సాయంతో అక్కడి పరిసరాలను దాని ఆపరేటర్ ప్రత్యేక కళ్లద్దాల సాయంతో లైవ్‌లో చూడటమే గాక వీడియో తీయగలడు. రిమోట్‌గా ఆపరేట్ చేయగలడు. → పరిసరాల చిత్రీకరణ వంటి సైనికేతర పనుల్లో ఈ డ్రోన్లను విరివిగా వాడుతుంటారు. వీటి రేంజ్ కొన్ని కిలోమీటర్లకే పరిమితం.రష్యా అణుదాడి చేస్తుందా...? ఉక్రెయిన్ డ్రోన్ దాడులపై రష్యా తీవ్ర అవమాన భారంతో ఉడికిపోతోంది. కారుచౌకైన డ్రోన్లతో కోలుకోలేని దెబ్బతీయడాన్ని జీర్ణం చేసుకోలేకపోతోంది. దీనికి ప్రతీకారం తప్పదని రష్యా రక్షణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. కనుక ఉక్రెయిన్‌పై భారీ స్థాయిలో విరుచుకుపడటం ఖాయమే. → ఉక్రెయిన్ ప్రధానంగా నాటో సభ్యదేశాలు సమకూర్చిన ఆయుధాలనే తనపై వాడుతోంది. కనుక యూరప్‌లోని నాటో దేశాల్లోని సైనిక స్థావరాలు, ఆయుధాగారాలను రష్యా లక్ష్యంగా చేసుకోవచ్చు. వాటిపై దాడులు చేస్తామని గతంలోనే ఎన్నోసార్లు హెచ్చరించింది కూడా. → ఉక్రెయిన్ బహుశా ఈ ప్రమాదాన్ని ముందే ఊహించింది. డ్రోన్ దాడులు పూర్తిగా తన పనేనని, నాటో మిత్రులకు ఏ సంబంధమూ లేదని జెలెన్స్కీ ప్రకటించారు. వాణిజ్యపరంగా సులువుగా అందుబాటులో ఉన్న డ్రోన్లనే దాడుల్లో వాడినట్టు వివరించారు. అందుకు రుజువుగా దాడుల ఫొటోలను విడుదల చేశారు. → నష్ట, అవమాన తీవ్రత దృష్ట్యా ఉక్రెయిన్‌పై రష్యా అణుదాడికి దిగినా ఆశ్చర్యం లేదని చెబుతున్నారు.రష్యాకు నష్టం ఇలా... → 41 టీయూ–95, టీయూ–22ఎం3 దీర్ఘ శ్రేణి బాంబర్లు, దాడుల్లో వాటికి ఆద్యంతం దన్నుగా నిలిచే ఏ–50 నిఘా విమానాలపై డ్రోన్ దాడులు జరిగాయి. → వాటిలో 14 పూర్తిగా, మిగతా 27 చాలావరకు ధ్వంసమైనట్టు చెబుతున్నారు. → మూడున్నరేళ్లుగా ఉక్రెయిన్‌పై క్షిపణి, బాంబు దాడులకు రష్యా ప్రధానంగా ఉపయోగిస్తున్నది ఈ విమానాలనే! → ఈ నష్టం విలువ కనీసం రూ.60 వేల కోట్ల (700 కోట్ల డాలర్ల)పై చిలుకేనని రష్యా రక్షణ శాఖే అంచనా వేసింది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
వాయుసేన చీఫ్‌కు తప్పిన ముప్పు
హోనోలులు: అమెరికా పర్యటనలో ఉన్న భారత్ ఎయిర్‌చీఫ్ మార్షల్ రాకేష్ భదౌరియాకు ముప్పు తప్పింది. హవాయి దీవుల్లోని పెరల్ హార్బర్లో బుధవారం ఇండో ఫసిఫిక్ ప్రాంతంలో భద్రతపై వివిధ దేశాల వైమానిక దళ మార్షల్స్ సదస్సులో ఆయన పాల్గొన్నారు. అదే సమయంలో ఒక నావికుడు పెరల్ హార్బర్లోకి చొరబడి కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఇద్దరు అమెరికన్లు మృతి చెందారు. కాల్పులు జరిపాక ఆ నావికుడు తనను షూట్‌చేసుకుని చనిపోయాడు. కాగా, భదౌరియా సురక్షితంగా ఉన్నారని భారత వైమానిక దళం వెల్లడించింది. పెరల్ హార్బర్లో అమెరికా వైమానిక దళ కేంద్రంలో ఈ సదస్సు జరిగే సమయంలో దగ్గర్లోని నావికాదళ కేంద్రంలో కాల్పుల ఘటన జరిగిందని వాయుసేన అధికారి చెప్పారు. కాల్పులకు కారణాలు తెలియాల్సి ఉందని హవాయి ప్రాంత నావికా దళ కమాండర్ అడ్మిన్ రాబర్ట్ చెప్పారు. 1941 డిసెంబర్ 7న జపాన్ పెరల్ హార్బర్‌పై జరిపిన దాడికి 78ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో అక్కడ నివాళులరి్పంచడానికి ఏర్పాట్లు చేస్తుండగా ఈ కాల్పుల ఘటన జరగడంతో అమెరికాలోనూ కలకలం రేగింది. -
'నాది ఆకర్షించే అందం కాదంట'
లండన్: పెరల్ హార్బర్ చిత్రం కోసం తనను నాజూకుగా తయారవ్వమని డైరెక్టర్ మైఖెల్ బే చెప్పినట్లు ప్రముఖ హాలీవుడ్ నటి కేట్ బెకిన్ సేల్ తెలిపింది. 2001న విడుదలైన రోమాంటిక్ యాక్షన్ చిత్రం పెరల్ హార్బర్ చిత్రంలో తాను నటించే నర్సు పాత్రకుగానూ ఆయన స్లిమ్ గా మారాలని సలహా ఇచ్చినట్లు చెప్పింది. అందుకోసం తనను బే కాస్తంత వర్కవుట్ చేయమన్నాడని తెలిపింది. ఆయన తనను కలిసి చెప్పేంత వరకు కూడా తన ఫిట్ నెస్‌పై ఎప్పుడూ అనుమానం లేదని కూడా ఆమె చెప్పింది. అయితే, 1940లో ఓ లెఫ్టినెంట్ నర్సు పాత్రలో స్లిమ్ గా కనిపించాల్సిన అవసరం ఎందుకో తనకు అర్ధం కాలేదని చెప్పింది. దీంతోపాటు చిత్ర ప్రమోషన్ సందర్బంగా కూడా బే తనది ఆకర్షించే రూపుకాదని వ్యాఖ్యానించి తన మనసు ఇబ్బంది పెట్టాడని చెప్పింది. ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించిన బెన్ ఆఫ్లెక్, జోష్ హార్ట్ నెట్లను మాత్రం తెగ పొగిడినట్లు వివరించింది.


