వైరల్‌ అవుతోన్న అభినందన్‌ ఫేక్‌ వీడియో

Abhinandan Varthaman fake Pakistani tea advertisement viral - Sakshi

ఇస్లామాబాద్‌ : ఇటీవల పాకిస్తాన్‌కు చెందిన అత్యాధునిక ఎఫ్‌–16 విమానాన్ని కూల్చివేసి, శత్రుదేశానికి పట్టుబడి కూడా సాహసోపేతంగా వ్యవహరించిన భారత వాయుసేన వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ స్వదేశానికి సురక్షితంగా తిరిగివచ్చిన విషయం తెలిసిందే. అయితే తొలుత అభినందన్‌పై దాడికి సంబంధించి వీడియోలు వైరల్ అవ్వడంతో దేశవ్యాప్తంగా ఆందోళన మొదలైంది. దీంతో జరిగిన నష్టాన్ని పూడ్చుకునే పనిలో భాగంగా పాక్ ఆర్మీ సిబ్బంది అభినందన్‌కు సపర్యలు చేసినట్లుగా వీడియో తీశారు. అందులో అభినందన్ టీ తాగుతూ పాక్ అధికారుల ప్రశ్నలకు బదులివ్వడం తెలిసిందే. అభినందన్ టీ తాగుతూ 'టీ చాలా బాగుంది.. థాంక్యూ'అంటూ పాక్‌ ఆర్మీ అధికారులకు కితాబిస్తారు. 
మార్ఫ్‌ చేసిన తాపల్ టీ వాణిజ్య ప్రకటన

అయితే కొందరు ఫేక్‌ రాయుళ్లు తమ క్రీయేటివిటీకి పదునుపెట్టారు. కరాచీకి చెందిన టీ కంపెనీ 'తాపల్' వాణిజ్య ప్రకటనను మార్ఫ్‌ చేసి అభినందన్‌ మాటలను జోడించి సోషల్‌ మీడియాలో పెట్టారు. ఇది నిజమేమోనని భావించి తాపల్‌ వాణిజ్య ప్రకటనలో అభినందన్‌ నటించారంటూ.. పాక్‌, భారత్‌లో ఈ వీడియో తెగ వైరల్‌ అవుతోంది. అయితే ఈ ప్రకటనకు తమ సంస్థకు ఎలాంటి సంబంధంలేదని తాపల్ సిబ్బంది చెబుతున్నా, అప్పటికే వీడియో తెగ చక్కర్లు కొట్టడంతో ఇప్పుడా టీ బ్రాండ్‌ పేరు పాకిస్తాన్‌, భారత్‌లో మారుమోగిపోతుంది.

అసలైన తాపల్ టీ వాణిజ్య ప్రకటన

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top