గోఫండ్‌మీ పేజ్‌ ద్వారా సేకరణ

600000 US Dollars Raised For Dhriti Narayan Struck By Car In Hate Crime - Sakshi

వాషింగ్టన్‌ : మతోన్మాదం మత్తులో తూగుతున్న ఓ వ్యక్తి ముస్లింలుగా భావించి ఓ కుటుంబాన్ని చంపేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి.. కోమాలోకి వెళ్లిన ఓ చిన్నారి కోలుకోవడం కోసం ప్రపంచమంతా ప్రార్థిస్తుంది. అంతేకాక ఆ చిన్నారి వైద్య ఖర్చులకు కావాల్సిన మొత్తాన్ని విరాళాల ద్వారా సేకరిస్తుంది. వివరాలు.. ఇండో అమెరికన్‌ కుటుంబానికి చెందిన ధ్రితి(13) గత నెల 23న తన కుటుబంతో కలిసిన బయటకు వెళ్తోంది. అయితే వీరిని ముస్లింలుగా భావించిన ఓ మోటరిస్ట్‌.. వారిని చంపేందుకు ప్రయత్నించాడు. కావాలనే మోటర్‌సైకిల్‌తో వారిని ఢీకొట్టాడు. ఈ దాడిలో ధ్రితి తీవ్రంగా గాయపడగా.. ఆమె తండ్రి, సోదరులకు గాయాలయ్యాయి.

ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే వారిని ఆస్పత్రికి చేర్చారు. అయతే ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ధ్రితి కోమాలోకి వెళ్లింది. ఆమెకు వైద్యం చేయడానికి 5 లక్షల అమెరికన్‌ డాలర్లు(రూ.3,46,80,750) ఖర్చవుతాయని వైద్యులు తెలిపారు. ఇంత భారీ మొత్తం ఖర్చు చేసి ధ్రితికి వైద్యం చేపించే స్థితిలో ఆమె కుటుంబం ఆర్థిక పరిస్థితులు లేవు. విషయం తెలుసుకున్న ‘గోఫండ్‌మి’ అనే ఫండ్‌ రైజింగ్‌ సంస్థ ధ్రితి పరిస్థితిని వివరిస్తూ.. ఆమె కుటుంబాన్ని ఆదుకోవాలంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. ఇలా చేసిన వారం రోజుల్లోనే.. దాదాపు 12,360 మంది జనాలు ధ్రితికి సాయం చేసేందుకు ముందుకు వచ్చారు.

దాంతో కేవలం ఏడు రోజుల్లోనే 6 లక్షల అమెరికన్‌ డాలర్లు (రూ.4,16,18,700 )విరాళంగా వచ్చాయి. ఈ మొత్తం వైద్యం ఖర్చుల కోసం కావాల్సిన దానికంటే ఎక్కువే ఉండటం గమనార్హం. ఇదిలా ఉంటే ప్రస్తుతం ధ్రితిపై దాడి చేసిన వ్యక్తి జైలులో ఉన్నాడు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top