తీవ్రవాదుల దాడి: 33 మంది మృతి | 33 killed, 147 injured in Afghanistan militant attack | Sakshi
Sakshi News home page

తీవ్రవాదుల దాడి: 33 మంది మృతి

Sep 5 2014 8:41 AM | Updated on Sep 2 2017 12:55 PM

ఆఫ్ఘానిస్థాన్లోని ప్రభుత్వ ప్రాంగణంపై తాలిబాన్ తీవ్రవాదులు దాడి చేశారు.

కాబూల్: ఆఫ్ఘానిస్థాన్లోని ప్రభుత్వ ప్రాంగణంపై తాలిబాన్ తీవ్రవాదులు దాడి చేశారు. ఆ దాడిలో 33 మంది మరణించారు. 147 మంది గాయపడ్డారని ఆ దేశ హోం మంత్రిత్వశాఖ వెల్లడించింది. తూర్పు ఆఫ్ఘానిస్థాన్లోని గజినీ ప్రావెన్స్లో రెండు వాహానాల పేలుడు పదార్థాలతో వచ్చి  తీవ్రవాదులు దాడికి తెగబడ్డారని చెప్పింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్నభద్రత సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని తీవ్రవాదులపైకి కాల్పులు జరిపారని తెలిపింది.

ఆ కాల్పులలో 10 మంది పోలీసు ఉన్నతాధికారులు మరణించారు. గాయపడిన వారిలో 130 మంది స్థానికులు కాగా, 17 మంది పోలీసు ఉన్నతాధికారులని పేర్కొంది. 2014లో తీవ్రవాదులు జరిపిన దాడిలో ఇది అత్యంతభయంకర సంఘటనగా హోం మంత్రిత్వశాఖ అభివర్ణించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement