ఇరాక్ మరోసారి బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఆత్మాహుతి దాడుల్లో కనీసం 21 మంది మరణించారు.
ఇరాక్ మరోసారి బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఆత్మాహుతి దాడుల్లో కనీసం 21 మంది మరణించగా, మరో 46 మంది గాయపడినట్టు బుధవారం ఆ దేశ భద్రత అధికారులు తెలిపారు.
టార్మియా పట్టణంలో మంగళవారం రాత్రి ఇద్దరు వ్యక్తులు ఆర్మీ దుస్తులు ధరించి ఓ నాయకుడి నివాసం వద్ద బాంబులు పేల్చుకున్నారు. ఈ సంఘటనలో 14 మంది మరణించగా, 25 మంది గాయపడినట్టు పోలీసులు తెలిపారు. ఆ సమయంలో షేక్ సయీద్ జాసిమ్ అనే నాయకుడు ఇచ్చిన విందుకు ఆర్మీ, పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మరణించినవారిలో ఆయన కుమారుడితో పాటు ఆర్మీ, పోలీసు అధికారులు ఉన్నారు. మరో ప్రాంతంలో పోలీస్ స్టేషన్ వద్ద జరిగిన ఆత్మాహుతి దాడిలో ప్రాణ నష్టం జరిగింది.