కారు నిండా బాంబులతో వచ్చి పేల్చుకున్నాడు | 12 killed in Kabul attack near Spanish embassy | Sakshi
Sakshi News home page

కారు నిండా బాంబులతో వచ్చి పేల్చుకున్నాడు

Dec 12 2015 3:17 PM | Updated on Sep 3 2017 1:53 PM

అఫ్గనిస్థాన్లో తాలిబన్లు రెచ్చిపోయారు. బాంబులతో ఆత్మాహుతి దాడులకు పాల్పడటంతో మొత్తం 12 మంది ప్రాణాలుకోల్పోయారు.

కాబుల్: అఫ్గనిస్థాన్లో తాలిబన్లు రెచ్చిపోయారు. బాంబులతో ఆత్మాహుతి దాడులకు పాల్పడటంతో మొత్తం 12 మంది ప్రాణాలుకోల్పోయారు. స్పానిష్ రాయభార కార్యాలయానికి అతి సమీపంలో ఈ బాంబు దాడి జరిగింది. దీంతో స్పానిష్ జాతీయులు ఇద్దరు చనిపోయారు. మరో ఐదుగురు పోలీసు అధికారులు కూడా మృత్యువాత పడ్డారు.

' షైరీ పూర్ లోని అతిథి గృహం ప్రవేశ ద్వారం వద్దకు ఓ కారులో బాంబులను వేసుకొని, తాను కూడా బాంబుల జాకెట్ ధరించి ఓ ఉగ్రవాది లోపలికి ప్రవేశించగా మరో ముగ్గురు కూడా ఆయుధాలతో వచ్చి ఒక్కసారిగా పేల్చేసుకున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా ధ్వంసమైంది' అని అఫ్గనిస్థాన్ అధికారులు చెప్పారు. భూకంపం సంభవించిన మాదిరిగా పేలుడు ధాటికి భూమి కంపించిందని అధికారులు చెప్పారు. తాము నిజంగానే భూకంపం సంభవించిందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement