ఇండోనేషియాలో వరదలు : 10 మంది మృతి | 10 killed in Indonesia flood, landslides | Sakshi
Sakshi News home page

ఇండోనేషియాలో వరదలు : 10 మంది మృతి

Sep 21 2016 10:53 AM | Updated on Sep 4 2017 2:24 PM

ఇండోనేషియాలోని పశ్చిమ జావా ప్రావిన్స్లో తాజాగా భారీ వర్షాలు, వరదలు కారణంగా 10 మంది మరణించారు.

జాకర్తా: ఇండోనేషియాలోని పశ్చిమ జావా ప్రావిన్స్లో తాజాగా భారీ వర్షాలు, వరదలు కారణంగా 10 మంది మరణించారు. మరో 30 మంది గాయపడ్డారని విపత్తు నిర్వహణ సంస్థ ప్రతినిధి బుధవారం వెల్లడించారు. గౌర్టు జిల్లాలో భారీ వర్షాలతో రెండు నదులు పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు చెప్పారు. వందలాది మందిని ప్రభుత్వ కార్యాలయ భవనాలు, మిలటరీ స్టేషన్స్కి తరలించి ఆశ్రయం కల్పించినట్లు వెల్లడించారు.

భారీగా మట్టి చరియలు రెండు ఇళ్లపై విరిగిపడ్డాయి. దీంతో అందులో నివసిస్తున్న ఇద్దరు మరణించారు. మరో ఇద్దరు గల్లంతయ్యారని తెలిపారు. వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఈ సహాయక చర్యల్లో సైనికులు, పోలీసులు పాల్గొన్నారని పేర్కొన్నారు. మంగళవారం రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తుందని చెప్పారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement