బ్రెగ్జిట్‌పై ముందుకే థెరెసా మే | ​U.K. PM May fights for survival after Brexit deal sparks crisis | Sakshi
Sakshi News home page

బ్రెగ్జిట్‌పై ముందుకే థెరెసా మే

Nov 17 2018 5:25 AM | Updated on Nov 17 2018 5:25 AM

​U.K. PM May fights for survival after Brexit deal sparks crisis - Sakshi

లండన్‌: ప్రస్తుతం కుదిరిన బ్రెగ్జిట్‌ ఒప్పందంపై స్వపక్షం నుంచే తీవ్ర వ్యతిరేకత వస్తున్నా తన నిర్ణయాన్ని మార్చుకోకుండా ముందుకు సాగేందుకే బ్రిటన్‌ ప్రధాని థెరెసా మే మొగ్గుచూపుతున్నారు. పార్లమెంటులో అవిశ్వాసాన్ని ఎదుర్కోవడానికి సిద్ధమేనన్నారు. బ్రెగ్జిట్‌ ఒప్పందంపై ప్రజల  భయాలను పోగొట్టేందుకు వారడిగే ప్రశ్నలకు తానే జవాబుచెప్తానన్నారు. యురోపియన్‌ యూనియన్‌ (ఈయూ)తో థెరెసా కుదుర్చుకున్న బ్రెగ్జిట్‌ ఒప్పందం ముసాయిదా బుధవారం విడుదలైనప్పటి నుంచి మంత్రులు సహా కొందరు ఎంపీలు థెరెసాను వ్యతిరేకిస్తున్నారు. ఈ ఒప్పందం బ్రిటన్‌ ప్రజలకు మంచిదేననీ, తన దృక్పథంలో ఇది అత్యుత్తమ ఒప్పందమన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement