బస్సును అలవోకగా తోస్తూ ఏనుగు హల్‌చల్‌ |  Elephant Attacks Bus | Sakshi
Sakshi News home page

బస్సును అలవోకగా తోస్తూ ఏనుగు హల్‌చల్‌

Published Mon, Dec 11 2017 3:01 PM | Last Updated on Mon, Dec 11 2017 3:24 PM

 Elephant Attacks Bus - Sakshi

బీజింగ్‌ : చైనాలోని యునాన్ ప్రావిన్స్‌లో ఓ ఏనుగు రెచ్చిపోయింది. తన ప్రశాంతతకు భంగం కలిగించారనే కోపంతో వాహనాలపై దాడికి దిగింది. తొలుత ఓ బస్సును టార్గెట్ చేసింది. దాన్ని అయిదుదారు అడుగులు వెనక్కి తోసేసింది. బస్సు అద్దాలను పగలగొట్టింది. అదృష్టవశాత్తు ఆ సమయంలో బస్సులో ప్రయాణీకులు ఎవరూలేకపోవడంతో ప్రమాదం తప్పింది.

బస్సులో ఉన్న డ్రైవర్ ఏనుగును చూసి పారిపోయాడు. కొద్దిసేపు బస్సుకు తన వీపును రుద్దుకున్న ఏనుగు అంతటితో ఆగని ఏనుగుఅదే దారిలో వున్న మిగితా వాహనాలను టార్గెట్‌ చేసింది. ఓ మినీ ట్రాన్స్‌పోర్ట్‌ వ్యానప్‌ పై దాడికి దిగింది. దాన్ని అమాంతం పడేసేందుకు గట్టిగా ప్రయత్నించింది. కుదరకపోవడంతో ఇక చాల్లే అనుకుని మెల్లిగా అడవిదారి పట్టింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement