
పార్టీ నేతలతో వైఎస్ జగన్ భేటీ
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలతో భేటీ అయ్యారు.
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం ఉదయం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. రాజ్యసభ అభ్యర్థి ఎంపికపై నేతలతో చర్చించి ఖరారు చేయనున్నారు. ఈ సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలు హాజరయ్యారు. జూన్ 11న రాజ్యసభకు ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. కాగా ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీ కానున్న నాలుగు స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి.