దీపకు వైఎస్ జగన్ అభినందనలు


హైదరాబాద్: రియో ఒలింపిక్స్కు అర్హత సాధించిన జిమ్నాస్ట్ దీపా కర్మకార్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ మెగా ఈవెంట్లో పతకం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. మంగళవారం ఉదయం వైఎస్ జగన్ ఈ మేరకు ట్వీట్ చేశారు.త్రిపురకు చెందని దీప ఈ ఏడాది జరిగే  రియో ఒలింపిక్స్కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. ఒలింపిక్స్కు అర్హత సాధించిన తొలి భారత మహిళా జిమ్నాస్ట్గా ఆమె చరిత్ర సృష్టించింది.

 

 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top