breaking news
gymnast Dipa Karmakar
-
డోపింగ్‌లో పట్టుబడ్డ దీపా కర్మాకర్‌పై వేటు
న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్‌లో భారత మెరికగా అందరి దృష్టిని విశేషంగా ఆకర్షించిన స్టార్ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ డోపింగ్‌లో పట్టుబడింది. నిషిద్ధ ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు పరీక్షల్లో తేలడంతో ఆమెపై అంతర్జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ (ఐటీఏ) 21 నెలల నిషేధం విధించింది. 2016లో ‘రియో’ విశ్వవేదికపై ప్రమాదకరమైన ‘ప్రొడునొవా’ విన్యాసంతో దీప ఆకట్టుకుంది. ప్రదర్శన ముగిసి ల్యాండింగ్ సమస్యతో త్రుటిలో ఆమె కాంస్య పతకాన్ని కోల్పోయి చివరకు నాలుగో స్థానంతో తృప్తి పడింది. అయితే భారత విశ్లేషకులు, క్రీడాభిమానులంతా ఆమె ప్రదర్శనను ఆకాశానికెత్తారు. తదనంతరం గాయాల బెడదతో మరే మెగా ఈవెంట్లోనూ ఆమె పాల్గొనలేకపోయింది. నిజానికి 2021 అక్టోబర్‌లోనే ఆమె డోపింగ్‌లో పట్టుబడింది. కానీ ఈ విషయాన్ని ఇప్పుడు బహిర్గతం చేశారు. అప్పటి నుంచి శిక్షాకాలం అమలు కావడంతో ఈ ఏడాది జూలై 10వ తేదీతోనే నిషేధం ముగుస్తుంది. -
దీపకు వైఎస్ జగన్ అభినందనలు
హైదరాబాద్: రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన జిమ్నాస్ట్ దీపా కర్మకార్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ మెగా ఈవెంట్లో పతకం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. మంగళవారం ఉదయం వైఎస్ జగన్ ఈ మేరకు ట్వీట్ చేశారు. త్రిపురకు చెందని దీప ఈ ఏడాది జరిగే రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి భారత మహిళా జిమ్నాస్ట్‌గా ఆమె చరిత్ర సృష్టించింది. Congratulations and best wishes for #Rio2016 Olympics to Dipa Karmakar, our first Olympic-qualifying Indian woman gymnast. — YS Jagan Mohan Reddy (@ysjagan) 19 April 2016