ఆమె చేసిన అమూల్యమైన సేవలు ఎనలేనివి: సీఎం జగన్‌ | AP CM YS Jagan Congratulate Sudha Murthy For Nominated to RS | Sakshi
Sakshi News home page

ఆమె చేసిన అమూల్యమైన సేవలు ఎనలేనివి: సుధా మూర్తికి ఏపీ సీఎం జగన్ శుభాకాంక్షలు

Mar 8 2024 8:19 PM | Updated on Mar 9 2024 2:30 AM

AP CM YS Jagan Congratulate Sudha Murthy For Nominated to RS - Sakshi

పరోపకారిగా, సామాజిక సేవకురాలిగా, వ్యాపారవేత్తగా, రచయిత్రిగా ఆమె చేసిన అమూల్యమైన సేవలు ఎనలేనివి.

సాక్షి, గుంటూరు: ప్రముఖ విద్యావేత్త, ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తి రాజ్యసభకు నామినేట్‌ కావడంపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు తన ఎక్స్‌ ఖాతాలో ఆయన ఒక సందేశం ద్వారా సుధామూర్తికి శుభాకాంక్షలు తెలియజేశారు. 

అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున రాజ్యసభకు నామినేట్ అయినందుకు శ్రీమతి సుధామూర్తిగారికి నా హృదయపూర్వక అభినందనలు. పరోపకారిగా, సామాజిక సేవకురాలిగా, వ్యాపారవేత్తగా, రచయిత్రిగా ఆమె చేసిన అమూల్యమైన సేవలు ఎనలేనివి. భవిష్యత్ లో సుధామూర్తి మరింత ఉన్నత శిఖరాలను అందుకోవాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నా అని ట్వీట్‌ చేశారాయన. 

ఇదిలా ఉంటే.. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమెను ఎగువ సభకు నామినేట్‌ చేసినట్లు ప్రధాని నరేంద్ర మోదీ ‘ఎక్స్‌ (ట్విటర్‌)’ వేదికగా వెల్లడించారు. మహిళా దినోత్సవం రోజున ఈ ప్రకటన వెలువడటంతో డబుల్‌ సర్‌ప్రైజ్‌గా.. చాలా ఆనందంగా ఉందని ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న సుధా మూర్తి ఓ మీడియా సంస్థ ద్వారా స్పందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement