మద్యం మత్తులో ద్విచక్రవాహనాన్ని నడుపుతూ ఆగిఉన్న మారుతి కారును ఢీకొట్టడంతో ఓ యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు.
హైదరాబాద్ : మద్యం మత్తులో ద్విచక్రవాహనాన్ని నడుపుతూ ఆగి ఉన్న మారుతి కారును ఢీకొట్టడంతో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన చైతన్యపురి పరిధిలోని ఎన్.టి.ఆర్. నగర్‌లో శనివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఈ ఘటనలో మన్సూరాబాద్‌కు చెందిన అభిషేక్ (26) అనే యువకుడు మృతి చెందాడు.
స్థానికులు వెంటనే స్పందించి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై చైతన్యపురి పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.


