అమ్మని లేపితే లేస్తల్లేదు.... | Woman raped and murdered in hyderabad | Sakshi
Sakshi News home page

అమ్మని లేపితే లేస్తల్లేదు....

Oct 4 2014 12:08 PM | Updated on Aug 25 2018 4:51 PM

రాజేంద్ర నగర్లో బుద్వేల్ రైల్వే స్టేషన్ సమీపంలో ఓ మహిళపై దుండగులు అత్యాచారం చేసి అనంతరం హతమార్చారు.

హైదరాబాద్ : రాజేంద్ర నగర్లో బుద్వేల్ రైల్వే స్టేషన్ సమీపంలో ఓ మహిళపై దుండగులు అత్యాచారం చేసి అనంతరం హతమార్చారు. ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలను అపహరించుకు వెళ్లారు. లారీ పార్కింగ్ సమీపంలో తన కుమార్తెతో కలిసి రమ అనే మహిళ ఒంటరిగా నివసిస్తోంది.

 

అయితే ఈరోజు ఉదయం ఆమె కుమార్తె ...తల్లిని ఎంత లేపినా లేవటం లేదని ఏడుస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతురాలు కర్ణాటక వాసి. పోలీసులు మృతదేహాన్ని స్వాదీనం చేసుకుని, కేసు నమోదు చేశారు. తల్లి చనిపోయిన విషయం తెలియని చిన్నారి మాత్రం...అమ్మను లేపుతున్నా లేవటం లేదంటూ అమాయకంగా చెబుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement