రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి దుర్మరణం | wo killed in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి దుర్మరణం

Oct 12 2013 5:02 AM | Updated on Sep 1 2017 11:34 PM

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. ఎల్బీనగర్ పరిధిలో ఆర్టీసీ బస్సు బీటెక్ విద్యార్థిని బలిగొనగా...రాజేంద్రనగర్‌లో వేగంగా వచ్చిన కారు యువకుడి ప్రాణం తీసింది.

నాగోలు/అత్తాపూర్, న్యూస్‌లైన్: వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు.  ఎల్బీనగర్ పరిధిలో ఆర్టీసీ బస్సు బీటెక్ విద్యార్థిని బలిగొనగా...రాజేంద్రనగర్‌లో వేగంగా వచ్చిన కారు యువకుడి ప్రాణం తీసింది.
 ఎల్బీనగర్ పోలీసుల కథనం ప్రకారం...

హస్తినాపురానికి చెందిన కె.ఎలమంద, అంజలి దంపతులు కుమారుడు జయప్రకాశ్ (20) బండ్లగూడలోని అరోరా ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్నాడు. శుక్రవారం ఉదయం కళాశాలకు వెళ్లేందుకు సాగర్‌రింగురోడ్డుకు వచ్చాడు. ఉప్పల్ నుం చి మెహిదీపట్నం వెళ్తున్న ఆర్టీసీ బస్సు (ఏపీ28జెడ్ 2000) ఎక్కేందుకు ప్రయత్నిస్తూ అదుపుతప్పి వెనుక చక్రాల కిందపడి మృతి చెందాడు.  కుటుంబసభ్యులు ఘటనా స్థలానికి చేరుకొని కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులు బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

 కారు ఢీకొని యువకుడు...

 అనంతపురం జిల్లాకు చెందిన ఓబులేషు(25) డీసీఎంవ్యాన్‌పై క్లీనర్. వ్యాన్‌పై ఈనెల 7న కొత్తపేట మార్కెట్‌కు పుచ్చకాయలను తీసుకొచ్చా డు.  డీసీఎంను ట్రాన్స్‌పోర్టు ఆఫీసు వద్ద పెట్టి ఓబులేషు స్వగ్రామానికి వెళ్లాడు. శుక్రవారం ఉదయం తిరిగి వచ్చి రాజేంద్రనగర్‌లోని ఆచార్య ఎన్జీరంగా యూనివర్సిటీ ప్రధాన రహదారి ముందు బస్సు ఎక్కేందుకు రోడ్డు దాటుతుండగా.. శంషాబాద్ విమానాశ్రయం నుంచి నగరానికి వస్తున్న ఇన్నోవా కారు  (ఏపీ10టీవీ 2210) వేగంగా వచ్చి ఢీకొట్టింది.  తీవ్రగాయాలకు గురైన ఓబులేషును స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. రాజేంద్రనగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement