నా బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తా: సాయిరెడ్డి | Will do anything to strengthen party, says vijaya sai reddy | Sakshi
Sakshi News home page

నా బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తా: సాయిరెడ్డి

May 26 2016 12:35 PM | Updated on Aug 9 2018 3:21 PM

నా బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తా: సాయిరెడ్డి - Sakshi

నా బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తా: సాయిరెడ్డి

పార్టీ తనకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థి విజయ సాయిరెడ్డి అన్నారు.

హైదరాబాద్ : పార్టీ తనకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థి విజయ సాయిరెడ్డి అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన గురువారం రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం విజయ సాయిరెడ్డి మాట్లాడుతూ వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంతో తనకు మూడు తరాలుగా అనుబంధం ఉందన్నారు.

తన ప్రాణం ఉన్నంతవరకూ వైఎస్ఆర్ కుటుంబంతోనే ఉంటానని ఆయన స్పష్టం చేశారు. పార్టీ తరఫునుంచి తనను రాజ్యసభకు ఎంపిక చేసినందుకు సంతోషంగా ఉందని అన్నారు. రాజ్యసభలో పార్టీ  వాణిని వినిపిస్తానని విజయ సాయిరెడ్డి తెలిపారు. అలాగే పార్టీ ప్రాబల్యం పెంచేందుకు శాయశక్తులా కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement