చిన్నారులపై నేరాలకు వాట్సాప్ అలర్టు | WhatsApp alerts of crimes against children | Sakshi
Sakshi News home page

చిన్నారులపై నేరాలకు వాట్సాప్ అలర్టు

Sep 8 2016 7:32 PM | Updated on Sep 4 2017 12:41 PM

పిల్లలపై ఎలాంటి వేధింపులు జరిగినా వెంటనే స్పందించేందుకు బాలల హక్కుల సంఘం వాట్సాప్ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చింది.

పిల్లలపై ఎలాంటి వేధింపులు జరిగినా వెంటనే స్పందించేందుకు బాలల హక్కుల సంఘం వాట్సాప్ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చింది. బాల కార్మికులు, వీధిబాలలు, మాఫియా చేతిలో బిచ్చగాళ్లుగా మారినా, స్కూల్స్‌లో వేధింపులు, అత్యాచారాలు జరిగినా, ఆఖరకు కుటుంబ సభ్యులు వేధింపులకు గురిచేసినా 9491292424 అనే నంబరుకు వాట్సాప్ చేస్తే వెంటనే స్పందిస్తామని బాలల హక్కుల సంఘం గౌరవాధ్యక్షులు అచ్యుతరావు తెలిపారు. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సంఘం అధ్యక్షురాలు అనూరాధా రావు, స్లేట్ స్కూల్ విద్యార్ధులతో కలిసి వాట్సాప్ నంబర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ... ఈ వాట్సాప్ నంబర్ 24 గంటలు అందుబాటులో ఉంటుందని, ఫిర్యాదు చేసిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని వెల్లడించారు. ఇటీవల ఖైరతాబాద్ పెద్ద వినాయకుని వద్ద ఓ బాలుడు గాంధీ వేశధారణలో భిక్షాటన చేస్తున్నాడని అతన్ని పట్టుకుని హోంకు తరలించి వివరాలు తెలుసుకోగా ... పెద్ద మాఫియా అని గుర్తించినట్లు పిల్లలకు టీ, బన్ ఇచ్చి జనసంచారం ఎక్కువగా ఉన్న చోట భిక్షాటన చేయిస్తున్నారని, పిల్లాడు ప్రతీ రోజు 200 నుంచి 300 వారికి ఇవ్వాలని లేని పక్షంలో వాతలు పెడుతున్నట్లు సదరు బాలుడు తెలిపారని ఆవేదనవ్యక్తం చేశారు. వీధి పిల్లలు ప్రభుత్వ పిల్లలే అని గతంలో ప్రభుత్వాలు తెలిపాయని, ప్రస్తుతం వీధిపిల్లలు భిక్షాటన చేస్తుంటే ప్రభుత్వ పిల్లలు భిక్షాటన చేస్తున్నారా ..? అని ప్రశ్నించారు. తెలుగు రాష్ట్రల్లో పిల్లలు గాని, పెద్దలు గాని భాధ్యత గల ప్రతీ వ్యక్తులు వేధింపులకు గురౌతున్న పిల్లల వివరాలు తమకు వాట్సాప్ ద్వారా అందించాలని పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement