విభజనలో పోలీసులకు న్యాయం చేయాలి | we want to ap division for police | Sakshi
Sakshi News home page

విభజనలో పోలీసులకు న్యాయం చేయాలి

May 6 2016 1:09 AM | Updated on Jun 2 2018 4:56 PM

ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం మేరకు రాష్ట్రపతి ఉత్తర్వుల్లోని పేరా 14 ప్రకారం తెలంగాణ, ఏపీలకు ఉద్యోగులను పంపిణీ చేసినట్టుగానే...

ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం మేరకు రాష్ట్రపతి ఉత్తర్వుల్లోని పేరా 14 ప్రకారం తెలంగాణ, ఏపీలకు ఉద్యోగులను పంపిణీ చేసినట్టుగానే 14ఎఫ్ మినహాయింపు కింద నియామకాలు పొందిన హైదరాబాద్ పోలీసులను కూడా పంపిణీ చేయాలని తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ చైర్మన్, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ విభజన కమిటీని కోరారు. గురువారం ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ విభజనలో పోలీసు ఉద్యోగులకు అన్యాయం జరిగిందన్నారు.

హైదరాబాద్ సిటీ పోలీస్ చట్టంలోని సెక్షన్ 3(6) కింద నియామకం పొందిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఆరువేల మందిని స్థానికత ఆధారంగా వారివారి స్వస్థలాలకు పంపించాలని శ్రీనివాస్‌గౌడ్ విజ్ఞప్తి చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement