వైఎస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో చవితి వేడుకలు | Sakshi
Sakshi News home page

వైఎస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో చవితి వేడుకలు

Published Fri, Aug 29 2014 1:18 PM

Vinayaka Chaturthi festival celebrated in YSRCP Central office

హైదరాబాద్: హైదరాబాద్ లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వినాయకుని విగ్రహానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పూజలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ప్రజలకు ఆయన ఈ సందర్భంగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.

ప్రజలకు శాంతి, సౌభాగ్యాలు కలగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి పార్టీలోని పలువురు సీనియర్ నేతలతోపాటు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు హాజరయ్యారు. అనంతరం స్వామి వారి తీర్థ, ప్రసాదాలను కార్యాలయంలోని అందరికి అందజేశారు.

Advertisement
 
Advertisement
 
Advertisement