విజయ పథం

విజయ పథం - Sakshi

పాడి రైతులతో గ్రామ స్థాయిలో సొసైటీలను ఏర్పాటు చేయడానికి విజయ డెయిరీ ఏర్పాట్లు చేస్తోంది. పాలుపోసే రైతులు వేలల్లో ఉన్నా కేవలం 120  సొసైటీలే ఉన్నాయి. ప్రస్తుతం ప్రతి జిల్లాలో 100 సొసైటీలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. పాడి రైతులకు బీమా, సైకిళ్ల పంపిణీ, పశువుల కొనుగోలు కోసం బ్యాంకుల ద్వారా రుణాలు అందించడం వంటి వసతులను కల్పిస్తుంది.

 విజయ డెయిరీ ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌ 

ఒక రోజుకు పాల సేకరణ :3.60 లక్షల లీటర్లు 

‘విజయ’కు పాలు పోస్తున్న రైతులు :4.62 లక్షలు 

పాలను సేకరిస్తున్న గ్రామాలు :8,500  

గుర్తింపు పొందిన సొసైటీలు  : 128  

 బల్క్‌ మిల్క్‌ సెంటర్లు : 108  

చిల్లింగ్‌ సెంటర్లు 14  

పాల డెయిరీలు  : 06  

 

వైఎస్సార్‌ హయాంలో విజయ డెయిరీ బలో పేతమైంది. డెయిరీ అభివృద్ధికి నిధులు కేటాయించడమే కాకుండా పశుక్రాంతి పథకాన్ని అమలు చేసి రైతులకు అండగా నిలిచారు.

 

నెలకు రూ.40 కోట్లకు పైగా చెల్లింపులు..

పాడి రైతులకు విజయ డెయిరీ నెలకు రూ.40 కోట్లకుపైగా చెల్లిస్తోంది. 10 మిల్క్‌ యూనిట్ల వారీగా పాలు పోసే రైతులకు ప్రతి 15 రోజుల కొకసారి చెల్లిస్తున్నారు. రైతులతో సొసైటీలు ఏర్పాటు చేస్తే విజయ డెయిరీ దూసుకుపోనుంది.

 

సాక్షి, జనగామ: ప్రైవేటు కంపెనీలకు ఏమాత్రం తీసిపోకుండా ప్రభుత్వరంగ సంస్థ విజయ డెయిరీ పాల సేకరణలో రైతుల ఆదరణను పొందుతోంది. కార్పొరేట్‌ సంస్థలకు దీటుగా రోజుకు 3.60 లక్షల లీటర్ల పాలను సేకరిస్తోంది. భవిష్యత్‌లో మరింతగా వృద్ధి సాధించేందుకు సన్నాహాలు చేసు కుంటోంది. లీటర్‌ పాలలో ఫ్యాట్‌ను ఆధారంగా చేసుకుని ధర నిర్ణయించి రైతులకు నేరుగా డబ్బులను చెల్లిస్తున్నారు. అయితే ఒక్కో లీటర్‌కు అదనంగా ఇన్సెంటివ్‌ రూపంలో రూ.4 చొప్పున ఇస్తున్నారు. లీటర్‌ ధరతోపాటు ప్రోత్సాహంగా రూ.4 చెల్లించడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఇన్సెంటివ్‌ ప్రకటించడంతో విజయ డెయిరీకే పాలు విక్రయించేందుకు మొగ్గు చూపుతున్నారు. 

 

అవుట్‌లెట్స్‌ ఏర్పాటు

మన పాలు మనకే నినాదంతో విజయ డెయిరీ అనేక దిద్దుబాటు చర్యలు చేపట్టింది. గతంలో ప్రైవేటు ఏజెంట్లకు పాలు, పాల పదార్థాలను విక్రయించే బాధ్యతలను అప్పగించడంతో అనుకున్న స్థాయిలో వినియోగదారులను ఆకర్షించ లేకపోయింది. ఈ లోపాన్ని గుర్తించిన అధికారులు సొంతంగా అవుట్‌లెట్స్‌ ఏర్పాటు చేసుకున్నారు. 

 

బిల్లుల చెల్లింపుల్లో పారదర్శకత

గతంలో విజయ డెయిరీకి పాలు అమ్మితే డబ్బులు చెల్లించడంలో తీవ్ర జాప్యం జరిగేది. ఒక్కో పాడి రైతుకు వేలల్లో బకాయిలు పేరుకుపోయేవి. మూడు లేదా ఆరు నెలలకోమారు బిల్లులను చెల్లించడం వల్ల పాలను విజయ డెయిరీకి బదులు ఇతర కంపెనీలకు అమ్ముకునేవారు. ఇప్పుడు ఆ విధానం పూర్తిగా మారిపోయింది. ప్రతి 15 రోజులకోమారు బిల్లులను చెల్లిస్తున్నారు. గ్రామాల్లోని బీఎంసీల వారీగా పాడి రైతులకు నేరుగా డబ్బులను ఇచ్చేస్తున్నారు. బిల్లుల చెల్లింపుల్లో పారదర్శకత పెరగడంతో విజయ డెయిరీ పాల సేకరణలో గణనీయమైన ప్రగతి సాధిస్తోంది.

 

విజయ పాల ఉత్పత్తులను ప్రజల్లోకి తీసుకుపోవడంపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. 

 

తక్కువ పాల ఉత్పత్తి జిల్లాలు

మంచిర్యాల 115, వరంగల్‌ రూరల్‌ 2,835, భూపాలపల్లి 548, మహబూబాబాద్‌ 1,620, యాదాద్రి 1,681, జగిత్యాల 1,453, సిరిసిల్ల 1,275, కొత్తగూడెం 320 గోడలపై పాల ధరలు, ఉత్పత్తుల వివరాలను రాయిస్తుండటంతో కొనుగోళ్లు పెరుగుతున్నాయి.

 

విజయ పాల సేకరణ లేని జిల్లాలు ..

ఆదిలాబాద్, ఆసీఫాబాద్, నల్లగొండ, సూర్యాపేట, కరీంనగర్, పెద్దపల్లి 
Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top