నేరెళ్ల బాధితులు నిమ్స్‌కు తరలింపు | Victims of the nerella move to Nims | Sakshi
Sakshi News home page

నేరెళ్ల బాధితులు నిమ్స్‌కు తరలింపు

Sep 7 2017 3:19 AM | Updated on Sep 12 2017 2:04 AM

నేరెళ్లలో పోలీసుల దాడిలో తీవ్రంగా గాయపడ్డ బాధితులను బుధవారం కాంగ్రెస్‌ పార్టీ నాయకులు నిమ్స్‌కు తరలించారు.

బాధితులకు అండగా ర్యాలీ నిర్వహించిన కాంగ్రెస్‌ నేతలు

హైదరాబాద్‌: నేరెళ్లలో పోలీసుల దాడిలో తీవ్రంగా గాయపడ్డ బాధితులను బుధవారం కాంగ్రెస్‌ పార్టీ నాయకులు నిమ్స్‌కు తరలించారు. తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్, కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు గజ్జెల కాతం ఆధ్వర్యంలో దళితులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా బుధవారం అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆరుగురు బాధితులను మాజీ మంత్రి శ్రీధర్‌ బాబు, సీనియర్‌ నాయకులు భట్టివిక్రమార్క, కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు మల్లు రవి, అధికార ప్రతినిధి ఇందిరా శోభన్‌లు నిమ్స్‌ అత్యవసర విభాగంలో అడ్మిట్‌ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ప్రతిపక్ష పార్టీగా నేరెళ్ల ఘటనలో బాధితులకు అండగా ఉంటామని, వారికి న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు. బాధితులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement