టీడీపీ జెండా వాలిపోకుండా చూసుకో! | Tulasi Reddy comments on TDP | Sakshi
Sakshi News home page

టీడీపీ జెండా వాలిపోకుండా చూసుకో!

Jul 9 2016 2:47 AM | Updated on Aug 14 2018 11:26 AM

పులివెందులలో టీడీపీ జెండా ఎగరేయడం దేవుడెరుగు కాని ఆ జెండా కుప్పంలో వాలిపోకుండా చూసుకోవాలని పీసీసీ అధికార ప్రతినిధి తులసిరెడ్డి సీఎం చంద్రబాబుకు సూచించారు.

 పీసీసీ అధికార ప్రతినిధి తులసిరెడ్డి

 సాక్షి, హైదరాబాద్ : పులివెందులలో టీడీపీ జెండా ఎగరేయడం దేవుడెరుగు కాని ఆ జెండా కుప్పంలో వాలిపోకుండా చూసుకోవాలని పీసీసీ అధికార ప్రతినిధి తులసిరెడ్డి సీఎం చంద్రబాబుకు సూచించారు. శుక్రవారం ఇందిర భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 80 శాతం ప్రజలు ప్రభుత్వంపై సంతృప్తితో ఉన్నారని బాబు చేయించిన సర్వేలో వెల్లడి కావడం విడ్డూరంగా ఉందని, ఇదే నిజమైతే పార్టీ ఫిరాయించి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి తిరిగి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.

2014 టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న 600 వాగ్దానాల్లో ఆరింటినైనా నెరవేర్చలేదన్న విషయం ఆ పార్టీ నేతలందరికీ తెలిసినా నోరు విప్పలేని పరిస్థితుల్లో ఉన్నారని విమర్శించారు.

Advertisement
 
Advertisement
Advertisement