గ్రేటర్ అభ్యర్థుల ఎంపికకు కేకే నేతృత్వంలో కమిటీ | trs party formed special committee for election candidates selection | Sakshi
Sakshi News home page

గ్రేటర్ అభ్యర్థుల ఎంపికకు కేకే నేతృత్వంలో కమిటీ

Jan 11 2016 6:39 PM | Updated on Aug 14 2018 10:54 AM

గ్రేటర్ అభ్యర్థుల ఎంపికకు కేకే నేతృత్వంలో కమిటీ - Sakshi

గ్రేటర్ అభ్యర్థుల ఎంపికకు కేకే నేతృత్వంలో కమిటీ

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీఆర్ఎస్ పార్టీ వ్యూహాలు రచిస్తుంది.

- వెల్లడించిన టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్

హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార టీఆర్ఎస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. అందులో భాగంగా అభ్యర్థుల ఎంపికకు ఐదుగురు సభ్యులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు సోమవారం సీఎం కేసీఆర్ ప్రకటించారు. అభ్యర్థుల ఎంపిక నిష్పాక్షికంగా జరిగేందుకు వీలుగా నగరానికి చెందిన మంత్రులకు కమిటీలో చోటు కల్పించలేదని సీఎం పేర్కొన్నారు.

ప్రక్రియ పారదర్శకంగా  కొనసాగాలని, ఎంపికలో పార్టీ సర్వేలను ప్రామాణికంగా తీసుకోవాలని సీఎం కేసీఆర్ కేకే కమిటీ సభ్యులకు దిశానిర్దేశం చేశారు. అభ్యర్థుల ఎంపిక కమిటీకి రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు అధ్యక్షుడుకాగా, ప్రభుత్వ ముఖ్య సలహాదారు డి.శ్రీనివాస్, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్‌రెడ్డి సభ్యులుగా ఉన్నారు. సంప్రదింపుల అనంతరమే ఈ కమిటీ అభ్యర్థులను కేసీఆర్ ఎంపిక చేసినట్లు తెలుస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement