ఆ రెండు పార్టీలవి శవ రాజకీయాలు | TRS MLA Jeevan Reddy fires on TDP, Congress | Sakshi
Sakshi News home page

ఆ రెండు పార్టీలవి శవ రాజకీయాలు

Feb 19 2016 8:24 AM | Updated on Mar 18 2019 9:02 PM

ఆ రెండు పార్టీలవి శవ రాజకీయాలు - Sakshi

ఆ రెండు పార్టీలవి శవ రాజకీయాలు

టీడీపీ, కాంగ్రెస్‌లు రాష్ట్రంలో శవ రాజకీయాలు చేస్తున్నాయని టీఆర్‌ఎస్ నేత, ఆర్మూరు ఎమ్మెల్యే ఎ.జీవన్‌రెడ్డి మండిపడ్డారు.

టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి


సాక్షి, హైదరాబాద్ : టీడీపీ, కాంగ్రెస్‌లు రాష్ట్రంలో శవ రాజకీయాలు చేస్తున్నాయని టీఆర్‌ఎస్ నేత, ఆర్మూరు ఎమ్మెల్యే ఎ.జీవన్‌రెడ్డి మండిపడ్డారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేక ఈ రెండు పార్టీల నాయకులు అనవసర ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. తలారి సత్యం యాక్సిడెంట్‌కు, తనకూ ఎలాంటి సబంధం లేదని వివరించారు. తెలంగాణ భవన్‌లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, కాంగ్రెస్, టీడీపీ నాయకులకు వరుస పరాజయాలతో మైండ్ బ్లాంక్ అయిందని ఎద్దేవా చేశారు.

రోడ్డు ప్రమాదాన్ని కూడా హత్యగా చిత్రీకరించి శవ రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. పోలీసులు ఈ ప్రమాదంపై విచారణ జరిపి యాక్సిడెంట్‌గా తేల్చారని పేర్కొన్నారు. టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అబద్ధాలకు తండ్రిలాంటి వాడ ని వ్యాఖ్యానించారు. తాను యాక్సిడెంట్ చేయించినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తానని, లేదంటే రేవంత్ చేయాలని సవాలు చేశారు. కాంగ్రెస్ నాయకురాలు ఆకుల లలిత భర్త బ్యాంకును మోసం చేసి జైలుకు వెళ్లింది నిజం కాదా అని ప్రశ్నించారు.

Advertisement
 
Advertisement
Advertisement