మరో 45 మంది డీఎస్పీల బదిలీ | transfer orders to another 45 dsp's | Sakshi
Sakshi News home page

మరో 45 మంది డీఎస్పీల బదిలీ

Feb 22 2014 12:39 AM | Updated on May 25 2018 5:59 PM

రాష్ట్రంలో మరోసారి డీఎస్పీల బదిలీలు జరిగాయి. 45 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ ప్రసాదరావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మరోసారి డీఎస్పీల బదిలీలు జరిగాయి. 45 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ ప్రసాదరావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో 20 మంది ఇన్‌స్పెక్టర్‌లు పదోన్నతిపై డీఎస్పీలుగా నియమితులయ్యారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ సూచనలు, నిబంధనల మేరకే బదిలీలు జరిగినట్లు అధికారులు తెలిపారు. డీఎస్పీ పోస్టులు ఖాళీగా ఉండటం వల్లే 20 మంది ఇన్‌స్పెక్టర్‌లకు పదోన్నతులు కల్పించామని శాంతి భద్రతల విభాగం అదనపు డీజీ కౌముది తెలిపారు.
 
 15 జిల్లాలకు కొత్త మైనారిటీ సంక్షేమ అధికారులు
 15 జిల్లాలకు మైనారిటీల సంక్షేమ శాఖాధికారుల (డీఎండబ్ల్యూవో)ను నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. రెవెన్యూ శాఖలో డిప్యూటీ కలెక్టర్‌గా పదోన్నతి పొందిన 19 మంది అధికారులను ప్రభుత్వం ఒక సంవత్సరంపాటు డెప్యుటేషన్‌పై మైనారిటీ శాఖకు బదిలీ చేసింది. దీంతో వారిని డీఎండబ్ల్యూవోలుగా నియమించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement