ఎంఐఎంతో పొత్తు అంశాన్ని చర్చిస్తాం: పొన్నాల | Tomorrow we discussed about the matter on MIM Alliance, says Telangana State PCC Chief ponnala Lakshmaiah | Sakshi
Sakshi News home page

ఎంఐఎంతో పొత్తు అంశాన్ని చర్చిస్తాం: పొన్నాల

Sep 14 2014 2:12 PM | Updated on Sep 2 2017 1:22 PM

ఎంఐఎంతో పొత్తు అంశాన్ని చర్చిస్తాం: పొన్నాల

ఎంఐఎంతో పొత్తు అంశాన్ని చర్చిస్తాం: పొన్నాల

హైదరాబాద్ మహానగరంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య తెలిపారు.

హైదరాబాద్: హైదరాబాద్ మహానగరంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. పార్టీ బలోపేతం కోసం సోమవారం జలవిహార్లో నిర్వహించనున్న కాంగ్రెస్ పార్టీ సమావేశం ఏర్పాట్లను పొన్నాల పరిశీలించారు.

హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం, ఎంఐఎంతో పొత్తు, పార్టీ భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలపై రేపటి సమావేశంలో చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకుంటామని అన్నారు. ఈ సమావేశానికి హైదరాబాద్ నగరంలోని సీనియర్ నాయకుల నుంచి కార్యకర్తల వరకు అందరు హాజరవుతారని పొన్నాల లక్ష్మయ్య చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement