నేడు హెచ్సీయూకు రానున్న రాహుల్ | today night, rahul gandhi to visit HCU | Sakshi
Sakshi News home page

నేడు హెచ్సీయూకు రానున్న రాహుల్

Jan 29 2016 5:35 PM | Updated on Sep 3 2017 4:34 PM

నేడు హెచ్సీయూకు రానున్న రాహుల్

నేడు హెచ్సీయూకు రానున్న రాహుల్

ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి రానున్నారు.

హైదరాబాద్: ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి రానున్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్తో కలసి రాహుల్ శుక్రవారం రాత్రి హెచ్సీయూకు చేరుకుంటారు. రోహిత్ తల్లి రాధికతో కలసి రాహుల్, దిగ్విజయ్ దీక్ష చేయనున్నారు.

పీహెచ్డీ విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో ఈ నెల 19న రాహుల్ హెచ్సీయూలో పర్యటించిన సంగతి తెలిసిందే. రోహిత్ తల్లి రాధికను పరామర్శించారు. రోహిత్ మృతికి కారణమైనవారిని కఠినంగా శిక్షించాలని  డిమాండ్ చేశారు. అతని కుటుంబానికి పరిహారం చెల్లించడంతో పాటు ఉద్యోగం ఇవ్వాలని అన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement