నేడు ఓడీఎఫ్‌కు అరుణ్‌ జైట్లీ | Today Arun Jaitley visits ODF | Sakshi
Sakshi News home page

నేడు ఓడీఎఫ్‌కు అరుణ్‌ జైట్లీ

Aug 27 2017 2:31 AM | Updated on Sep 17 2017 5:59 PM

నేడు ఓడీఎఫ్‌కు అరుణ్‌ జైట్లీ

నేడు ఓడీఎఫ్‌కు అరుణ్‌ జైట్లీ

కేంద్ర రక్షణ శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ ఆదివారం సంగారెడ్డి జిల్లా కంది మండలం ఎద్దు మైలారంలోని ఆయుధ కర్మా గారాన్ని (ఓడీఎఫ్‌) సందర్శించనున్నారు.

సంగారెడ్డి, సాక్షి:  కేంద్ర రక్షణ శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ ఆదివారం సంగారెడ్డి జిల్లా కంది మండలం ఎద్దు మైలారంలోని ఆయుధ కర్మా గారాన్ని (ఓడీఎఫ్‌) సందర్శించనున్నారు. శనివారమే హైదరా బాద్‌కు చేరుకున్న ఆయన నగరంలోనే బస చేశారు. కాగా, ఆదివారం ఉదయం పది గంటలకు ఆయన హైదరాబాద్‌ నుంచి హెలీకాప్టర్‌లో ఓడీఎఫ్‌కు చేరుకుంటారు. ఇక్కడ తయారవుతున్న యుద్ధ ట్యాంకులను పరిశీలిస్తారు. అనంతరం కంచన్‌బాగ్‌లోని బీడీఎల్‌ కర్మాగారాన్ని సందర్శించి ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు.

Advertisement
 
Advertisement
Advertisement