breaking news
Arms Factory
-
ఆయుధ విక్రయాలు పైపైకే!
స్టాక్‌హోం: 2024లో ప్రపంచవ్యాప్తంగా ఆయుధ కంపెనీల పంట పండింది. ఉక్రెయిన్ మొదలుకుని గాజా దాకా నిర్నీరోధంగా సాగుతున్న యుద్ధాలే ఇందుకు ప్రధాన కారణం. ప్రపంచంలోని టాప్–100 ఆయుధ కంపెనీల ఆదాయంలో గతేడాది 5.9 శాతం మేరకు నికర పెరుగుదల నమోదైంది. స్టాక్‌హోం అంతర్జాతీయ శాంతి పరిశోధన సంస్థ (ఎస్ఐపీఆర్ఐ–సిప్రీ) సోమవారం విడుదల చేసిన తాజా గణాంకాల్లో ఈ మేరకు పేర్కొంది. ‘‘వాటి ఉమ్మడి ఆదాయం ఏకంగా 679 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఉక్రెయిన్, గాజా యుద్ధాలు, ప్రపంచవ్యాప్తంగా పలుచోట్ల ప్రాంతీయ ఉద్రిక్తలు పెచ్చరిల్లుతుండటం, దేశాలు పోటాపోటీగా ఆయుధ కొనుగోళ్లకు దిగుతుండటం, సైనిక వ్యయాన్ని ఎన్నడూ లేని స్థాయిలో అమాంతంగా పెంచేయడం దీనికి ప్రధాన కారణాలు’’అని ఒక ప్రకటనలో తెలిపింది. ఈ టాప్–100లో మూడు భారత కంపెనీలుండటం విశేషం. హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) 44వ స్థానంలో, భారత్ ఎల్రక్టానిక్స్ (బీఈ) 58, మడ్గావ్ డాక్ షిప్‌బిల్డర్స్ (ఎండీఎస్) 91వ స్థానంలో నిలిచాయి. వాటి ఉమ్మడి ఆదాయం 8.2 శాతం పెరిగి ఏకంగా రూ.67 వేల కోట్లు (750 కోట్ల డాలర్లు) దాటేసింది! ఏడేళ్లలో తొలిసారి ముఖ్యంగా ప్రపంచంలోని టాప్–5 ఆయుధ కంపెనీలు లాక్‌హీడ్ మార్టిన్ (అమెరికా), ఆర్టీఎక్స్ (అమెరికా), నార్త్రాప్ గ్రూమన్ కార్పొరేషన్ (అమెరికా), బీఏఈ సిస్టమ్స్ (బ్రిటన్), జనరల్ డైనమిక్స్ కార్పొరేషన్ (అమెరికా) అన్నింటి ఆదాయమూ గతేడాది పెరుగుదల నమోదు చేసింది. ఇలా జరగడం గత ఏడేళ్లలో ఇదే తొలిసారి కావడం విశేషం! ఒక్క అమెరికా కంపెనీల ఆదాయం 3.8 శాతం పెరిగి 334 బిలియన్ డాలర్లుగా నమోదైంది. జాబితాలోని 39 కంపెనీలకు గాను 30 కంపెనీలు ఆదాయాన్ని భారీగా పెంచేసుకున్నాయి. ‘‘అమెరికా, యూరప్అని మాత్రమే కాకుండా ప్రపంచమంతటా ఆయుధ విక్రయాలు పైపైకి దూసుకెళ్లాయి. ఒక్క ఆసియా–ఓíÙయానా ప్రాంతంలో మాత్రమే ఇందుకు ఏకైక మినహాయింపు. అక్కడ కూడా చైనా అంతర్గత సమస్యలే అందుకు దారితీశాయి’’అని సిప్రి నివేదిక పేర్కొంది. అమెరికా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన అత్యాధునిక ఎఫ్–35 యుద్ధ విమాన ప్రాజెక్టు తదితరాలపై నెలకొన్న అయోమయం అక్కడి ప్రధాన ఆయుధ కంపెనీల్లో భవిష్యత్తు పట్ల అనిశ్చితికి దారి తీస్తోంది’’అని సిప్రీ నివేదిక వివరించింది. టాప్–100లో యూరప్ నుంచి 26 కంపెనీలున్నాయి. వాటిలో 23 ఆదాయంలో భారీ పెరుగుదలను చవిచూశాయి. ‘‘వాటి ఉమ్మడి ఆదాయం ఏకంగా 13 శాతం పెరిగి 151 బిలియన్ డాలర్ మార్కును దాటేసింది. ఉక్రెయిన్ యుద్ధం, ఆ దెబ్బకు రష్యా నుంచి తమకూ ముప్పు తప్పదేమోనని యూరప్ దేశాలు భారీగా ఆయుధ కొనుగోళ్లకు దిగడమే ఇందుకు కారణం’అని నివేదిక తెలిపింది.రెండు రష్యా కంపెనీలు టాప్–100 జాబితాలో రెండు రష్యా కంపెనీలు కూడా ఉండటం విశేషం. అవి రోస్టెక్, యునైటెడ్ షిప్ బిల్డింగ్ కార్పొరేషన్. వాటి ఉమ్మడవి ఆదాయం 23 శాతం పెరిగి 31.2 బిలియన్ డాలర్లుగా నమోదైంది. అంతర్జాతీయంగా అగ్ర దేశాలన్నీ ఎడాపెడా నిషేధాలు, ఆంక్షలు విధించినా ఈ పరిణామం చోటుచేసుకోవడం విశేషమే. దేశీయ డిమాండే ఇందుకు కారణమని సిప్రీ వెల్లడించింది. టాప్–100లో మధ్యప్రాచ్యం నుంచి తొలిసారి 9 కంపెనీలు స్థానం దక్కించుకున్నాయి. అవన్నీ కలిసి 31 బిలియన్ డాలర్లు ఆర్జించాయి. 2023తో పోలిస్తే ఇది ఏకంగా 14 శాతం పెరుగుదల. ఇక టాప్–100లో చోటు దక్కిన మూడు ఇజ్రాయెల్ కంపెనీల ఉమ్మడి ఆదాయం 16 శాతం పెరిగి 16.2 బిలియన్ డాలర్లుగా తేలింది. అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీ కూడా తొలిసారిగా ఈ జాబితాలో చేరింది. 2023తో పోలిస్తే దాని ఆదాయం రెట్టింపుకు పైగా పెరిగి 180 కోట్ల డాలర్లుగా నమోదైంది. -
ఏకే203 @ అమేథి
అమేథి అనగానే ఉత్తరప్రదేశ్‌లోని కాంగ్రెస్ కంచుకోట గుర్తుకొస్తుంది ఎవరికైనా! ఆఫ్కోర్స్ ఇప్పుడు కాదనుకోండి... కాంగ్రెస్ యువనేత రాహుల్‌గాంధీని 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఫైర్‌బ్రాండ్ స్మృతి ఇరానీ అక్కడ ఓడించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అమేథి రక్షణ ఉత్పత్తుల్లో సరికొత్త కేంద్రంగా అవతరించనుంది. అమేథిలో ఏర్పాటు చేయనున్న ఆయుధ కర్మాగారంలో ఏకంగా 6 లక్షల ఏకే203 అసల్ట్ రైఫిల్స్‌ను ఉత్పత్తి చేయడానికి సంబంధించి రష్యాతో ఒప్పందానికి భారత రక్షణ శాఖ మంగళవారం పచ్చజెండా ఊపింది. భారత సాయుధ బలగాలు ప్రస్తుతం వాడుతున్న ఇన్సాస్ రైఫిల్స్ స్థానంలో దశలవారీగా ఈ అధునాతన కలష్నికోవ్ శ్రేణి రైఫిల్స్ వచ్చి చేరనున్నాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వచ్చేనెల ఆరో తేదీన భారత పర్యటనకు రానున్నారు. ఈ పర్యటనలో దీనికి సంబంధించి భారత్– రష్యాల మధ్య కీలక ఒప్పందం కుదరనున్నట్లు తెలుస్తోంది. భారత్ నినాదమైన ‘మేకిన్ ఇండియా’లో భాగంగా ఇరుదేశాల సంయుక్త భాగస్వామ్యంలో ఏకే203 రైఫిల్స్ ఉత్పత్తి జరుగుతుంది. మొదటి 70 వేల రైఫిల్స్‌కు సంబంధించినంత వరకు రష్యా తయారీ విడిభాగాలను వాడతారు. తర్వాత ఇరుదేశాల మధ్య ఈ రైఫిల్స్ తయారీకి సంబంధించి సాంకేతికత బదిలీ పూర్తయి... భారత్‌లోనే తయారైన విడిభాగాలతో ఉత్పత్తి మొదలవుతుంది. మొదటి 70 వేల రైఫిల్స్ వచ్చే ఏడాది భారత సైనిక బలగాలకు అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. మొత్తం రూ. 5,000 కోట్ల విలువైన ఒప్పందానికి మంగళవారం డిఫెన్స్ అక్విజేషన్ కౌన్సిల్ (డీఏసీ) తుది ఆమోదముద్ర వేసిందని రక్షణవర్గాల విశ్వసనీయ సమాచారం. ఐఏఎఫ్‌కు జీశాట్–7సీ శాటిలైట్ భారత వాయుసేనకు జీశాట్– 7సీ శాటిలైట్, దాని సంబంధిత ఉపకరణాల కొనుగోలు నిమిత్తం కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన మంగళవారం జరిగిన డిఫెన్స్ అక్విజేషన్ కౌన్సిల్ ఆమోదముద్ర వేసింది. రూ.2,236 కోట్ల నిధులను ఇందుకోసం కేటాయించింది. భారత వాయుసేన సాంకేతిక, సమాచార వ్యవస్థల ఆధునికీరణకు సంబంధించిన అవసరాల కోసం ‘మేకిన్ ఇన్ ఇండియా’ కార్యక్రమం కింద ఈ ప్రతిపాదనను ఆమోదించినట్లు రక్షణశాఖ వెల్లడించింది. – నేషనల్ డెస్క్, సాక్షి -
నేడు ఓడీఎఫ్‌కు అరుణ్ జైట్లీ
సంగారెడ్డి, సాక్షి: కేంద్ర రక్షణ శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఆదివారం సంగారెడ్డి జిల్లా కంది మండలం ఎద్దు మైలారంలోని ఆయుధ కర్మా గారాన్ని (ఓడీఎఫ్) సందర్శించనున్నారు. శనివారమే హైదరా బాద్‌కు చేరుకున్న ఆయన నగరంలోనే బస చేశారు. కాగా, ఆదివారం ఉదయం పది గంటలకు ఆయన హైదరాబాద్ నుంచి హెలీకాప్టర్‌లో ఓడీఎఫ్‌కు చేరుకుంటారు. ఇక్కడ తయారవుతున్న యుద్ధ ట్యాంకులను పరిశీలిస్తారు. అనంతరం కంచన్‌బాగ్‌లోని బీడీఎల్ కర్మాగారాన్ని సందర్శించి ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు.


