ఆదివారం అర్థరాత్రి స్వదేశానికి కోదండరాం | TJAC professor kodandaram will return to hyderabad | Sakshi
Sakshi News home page

ఆదివారం అర్థరాత్రి స్వదేశానికి కోదండరాం

Jun 18 2016 6:32 PM | Updated on Jul 6 2019 12:42 PM

టీజేఏసీ చైర్మన్, ప్రొఫెసర్ యం. కోదండరాం ఆస్ట్రేలియా పర్యటన ముగించుకుని ఆదివారం అర్ధరాత్రి దాదాపు 12 గంటలకు హైదరాబాద్ కు విచ్చేయనున్నారు.

హైదరాబాద్: టీజేఏసీ చైర్మన్, ప్రొఫెసర్ యం. కోదండరాం ఆస్ట్రేలియా పర్యటన ముగించుకుని ఆదివారం అర్ధరాత్రి దాదాపు 12 గంటలకు హైదరాబాద్ కు విచ్చేయనున్నారు. శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుని, అక్కడి నుంచి హైదరాబాద్ కు వస్తారని టీజేయేసీ కోఆర్డినేటర్ పిట్టల రవీందర్ మీడియాకు తెలిపారు. ఆస్ట్రేలియాలోని తెలుగు ఎన్ఆర్ఐ సంస్థల ఆహ్వానం మేరకు ఈనెల 8వ తేదీన హైదరాబాద్ నుండి బయలుదేరి వెళ్లిన కోదండరాం ఆ దేశంలోని వివిధ పట్టణాలలో అక్కడి తెలంగాణా సంస్థలు ఏర్పాటు చేసిన అనేక కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఆ కార్యక్రమాలు ముగించుకుని ఆదివారం అర్థరాత్రి స్వదేశానికి విచ్చేయనున్నట్లు రవీందర్ ఓ ప్రకటనలో వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement