బ్యాంకు మేనేజర్‌కు మూడేళ్ల జైలు | Three years in prison for bank manager | Sakshi
Sakshi News home page

బ్యాంకు మేనేజర్‌కు మూడేళ్ల జైలు

Oct 14 2016 12:16 AM | Updated on Aug 28 2018 7:09 PM

‘స్టేట్‌బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్’ సికింద్రాబాద్ బ్రాంచ్ మేనేజర్ ఎన్‌ఎంఆర్ దీక్షితులుకు సీబీఐ ప్రత్యేక కోర్టు

 సాక్షి, హైదరాబాద్: ‘స్టేట్‌బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్’ సికింద్రాబాద్ బ్రాంచ్ మేనేజర్ ఎన్‌ఎంఆర్ దీక్షితులుకు సీబీఐ ప్రత్యేక కోర్టు మూడేళ్ల కఠిన కారాగార శిక్షతోపాటు రూ.లక్ష జరిమానా విధించింది. మరో నిందితురాలు జయశ్రీకి ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.1.75 లక్షల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. కేసులో నిందితుడు చక్కిలం రఘురామ్ తీర్పు సందర్భంగా కోర్టుకు హాజరుకాకపోవడంతో ఆయన్ను అరెస్టు చేయాలని నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.

 చక్కిలం ఎస్టేట్స్ సంస్థను నిర్వహించే చక్కిలం రఘురామ్.. తప్పుడు పత్రాలతో స్టేట్‌బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్ శివాజీనగర్ సికింద్రాబాద్ బ్రాంచ్ నుంచి రూ.2.5 కోట్లు రుణంగా తీసుకున్నారు. బ్యాంకు మేనేజర్లు ఎన్‌ఎంఆర్ దీక్షితులు, ఉదయ్‌కుమార్ (కేసు విచారణ సమయంలో చనిపోయారు)లు నిందితులు రఘురామ్, చక్కిలం ఎస్టేట్స్ ఉద్యోగి జయశ్రీలతో కుమ్మక్కైనట్లు సీబీఐ కేసు నమోదు చేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement