ఆరో తరగతి చదువుతున్న ముగ్గురు బాలికలు కనిపించకుండాపోయారు.
హైదరాబాద్: రామంతాపూర్ సత్యసాయి టెక్నో స్కూల్‌లో ఆరో తరగతి చదువుతున్న ముగ్గురు బాలికలు కనిపించకుండాపోయారు. చిలుకూరు బాలాజీ టెంపుల్‌కు వెళ్తున్నామని తోటి వారికి చెప్పి శుక్రవారం ఉదయం బయలుదేరిన హరిణి, శ్రావ్య, నేహ అనే వారు తిరిగిరాలేదు. వీరి అదృశ్యంపై తల్లిదండ్రులు ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు.