
ఔటర్‌పై రోడ్డు ప్రమాదం : ముగ్గురు మృతి
ఔటర్ రింగ్‌రోడ్డు మరోసారి రక్తసిక్తమైంది.
హైదరాబాద్ సిటీ: ఔటర్ రింగ్‌రోడ్డు మరోసారి రక్తసిక్తమైంది. హిమాయత్‌సాగర్ సనా ఫంక్షన్ హాల్ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మరణించగా..మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
గుంటూరు నుంచి హైదరాబాద్ వస్తున్న ఎస్టీమ్ కారు అదుపు తప్పి డివైఢర్‌ను ఢీకొట్టి అమాంతం ఎగిరిపడి..ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొట్టింది. దీంతో మొదటి కారులో ప్రయాణిస్తున్న విజయ్‌కుమార్(26), గీతా రాణి(45), తనూజ(40) అనే ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా..మరో ఆరుగురు గాయపడ్డారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.