మియూపూర్‌లోని లేక్‌వ్యూ ఎన్‌క్లేవ్‌లో భారీ చోరీ జరిగింది.
మియూపూర్‌లోని లేక్‌వ్యూ ఎన్‌క్లేవ్‌లో గురువారం రాత్రి భారీ చోరీ జరిగింది. అమర్‌నాధ్ అనే వ్యక్తి ఇంటి తాళాలు పగలగొట్టి సుమారు 70 తులాల బంగారం, 2 కేజీల వెండి దొంగిలించారు. అమర్‌నాథ్ వ్యక్తిగత పనిమీద భార్యతో కలిసి ఊరెళ్లాడు. ఇంటికి కొద్దిదూరంలోనే ఆయన చెల్లెలు ఉంటోంది. అమర్‌నాథ్ తల్లి ప్రభావతమ్మ కూతురు ఇంటికి వెళ్లడంతో దొంగలు అదును చూసి తమ చేతివాటం ప్రదర్శించారు. బాధితురాలు ప్రభావతమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనాస్థలానికి క్లూస్‌టీం రప్పించి ఆధారాలు సేకరిస్తున్నారు.