నగరంలో రోజు రోజుకు మహిళలపై అఘాయిత్యాలు, హత్యలు ఎక్కువవుతున్నాయి.
నగరంలో రోజు రోజుకు మహిళలపై అఘాయిత్యాలు, హత్యలు ఎక్కువవుతున్నాయి. నగరంలోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తుతెలియని మహిళను కొందరు దుండగులు బండరాళ్లతో మోది హత్య చేశారు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపడుతున్నారు. గతంలో కూడా హెచ్‌ఎంటీ నిర్జన ప్రదేశంలో ఇలాంటి దారుణాలు జరిగాయి. అయినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆందోళన చేస్తున్నారు.