గ్రేటర్ ఎన్నికలపై టీ. వైఎస్సార్సీపీ సమీక్షలు | telangana ysrcp reviews on ghmc elections | Sakshi
Sakshi News home page

గ్రేటర్ ఎన్నికలపై టీ. వైఎస్సార్సీపీ సమీక్షలు

Dec 1 2015 6:29 PM | Updated on Aug 11 2018 8:00 PM

త్వరలో జరగనున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో రంగారెడ్డి జిల్లాలోని నియోజకవర్గాల వారీగా వైఎస్ కాంగ్రెస్ పార్టీ సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నట్లు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. శివకుమార్ తెలిపారు.

హైదరాబాద్: త్వరలో జరగనున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో రంగారెడ్డి జిల్లాలోని నియోజకవర్గాల వారీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నట్లు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. శివకుమార్ తెలిపారు. ఆయా నియోజకవర్గాల పరిధిలో సమీక్షల్లో రంగారెడ్డిజిల్లా అధ్యక్షుడు సురేష్ రెడ్డి, జిల్లా పరిశీలకులు కె. శివకుమార్‌లు పాల్గొంటారని తెలిపారు. ఈ నెల 3వ తేదీ గురువారం కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి...శుక్రవారం కూకట్ పల్లి, మల్కాజ్గిరి నియోజకవర్గాలలో సమీక్షలు నిర్వహించనున్నారు.

ఆ తరువాత రెండు రోజులు పాటు ఉప్పల్, ఎల్బీనగర్, మహేశ్వరం, రాజేంద్రనగర్ నియోజకవర్గాలలో వైఎస్సార్సీపీ సమీక్షలు జరపనుంది. ఈ సమీక్షల్లో గ్రేటర్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అనుసరించాల్సిన వ్యూహాలు, పార్టీ అభ్యర్థి ఎంపికతో పాటు, స్థానికంగా పార్టీ బలోపేతానికి చర్చిస్తామని గ్రేటర్ నాయకులు తెలిపారు. ఈ సమావేశాల్లో స్థానిక నేతలు, కార్యకర్తలు పాల్గొనాలని కోరారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement