తెలంగాణలో నేరాలు తగ్గాయి: డీజీపీ | Telangana crime review over 2015 year, says DGP anuragh sharma | Sakshi
Sakshi News home page

తెలంగాణలో నేరాలు తగ్గాయి: డీజీపీ

Dec 30 2015 12:24 PM | Updated on Aug 11 2018 8:45 PM

తెలంగాణలో నేరాలు తగ్గాయి: డీజీపీ - Sakshi

తెలంగాణలో నేరాలు తగ్గాయి: డీజీపీ

2015లో తెలంగాణలో నమోదైన నేరాలపై డీజీపీ అనురాగ్‌శర్మ సమీక్ష నిర్వహించారు.

హైదరాబాద్‌: 2015వ సంవత్సరంలో తెలంగాణలో నమోదైన నేరాలపై డీజీపీ అనురాగ్‌ శర్మ సమీక్ష నిర్వహించారు. గత సంవత్సరంతో పోలిస్తే 8 శాతం నేరాలు తగ్గినట్టు ఆయన పేర్కొన్నారు. బుధవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 92వేల ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని చెప్పారు.

ఈవ్‌టీజర్ల ఆటకట్టేంచేందుకు షీటీమ్స్‌ను రంగంలో దింపడంతో 825 మంది ఈవ్‌టీజర్స్‌ను అరెస్ట్‌ చేశామన్నారు. షీ టీమ్స్‌ బాగా పనిచేశాయని కొనియాడారు. గణాంకాల ప్రకారం చైన్‌ స్నాచింగ్‌లు తగ్గినట్టు తెలిపారు. అంతేకాక రికవరీ శాతం 54.96 గా ఉందని డీజీపీ అనురాగ్‌శర్మ వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement