ఏపీలో టీచర్ల బదిలీల షెడ్యూలు విడుదల | teachers transfers shedule released for andhra pradesh | Sakshi
Sakshi News home page

ఏపీలో టీచర్ల బదిలీల షెడ్యూలు విడుదల

Aug 28 2015 6:25 PM | Updated on Aug 18 2018 8:53 PM

ఏపీలో టీచర్ల బదిలీల షెడ్యూలు విడుదల - Sakshi

ఏపీలో టీచర్ల బదిలీల షెడ్యూలు విడుదల

ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయుల బదిలీలకు పచ్చజెండా ఊగింది. ఈ మేరకు టీచర్ల బదిలీల షెడ్యూలును రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు శుక్రవారం ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయుల బదిలీలకు పచ్చజెండా ఊగింది. ఈ మేరకు టీచర్ల బదిలీల షెడ్యూలును రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు శుక్రవారం ప్రకటించారు. ఆగస్టు 31వ తేదీ నుంచి సెప్టెంబర్ 30 వరకు ఈ బదిలీలు జరుగుతాయని ఆయన తెలిపారు.

పాఠశాలల హేతుబద్ధీకరణ పూర్తయిందని, 2,998 స్కూళ్లను విలీనం చేశామని మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. సెప్టెంబర్ 6 నుంచి టీచర్ల బదిలీలకు సంబంధించి వెబ్ కౌన్సెలింగ్ జరుగుతుందన్నారు. సెప్టెంబర్ 19న సీనియారిటీ జాబితాలను ప్రకటిస్తామని, 24 నుంచి 27 వరకు వెబ్ ఆప్షన్లను స్వీకరిస్తామని గంటా శ్రీనివాసరావు చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement