టీడీపీ వైఖరి స్పష్టం చేయాల్సిందే | TDP's attitude is to clarify | Sakshi
Sakshi News home page

టీడీపీ వైఖరి స్పష్టం చేయాల్సిందే

Sep 19 2017 2:15 AM | Updated on Sep 19 2017 4:44 PM

టీడీపీ వైఖరి స్పష్టం చేయాల్సిందే

టీడీపీ వైఖరి స్పష్టం చేయాల్సిందే

సామాజికవేత్త, ప్రొఫెసర్‌ కంచ ఐలయ్యపై ఏపీ టీడీపీ నాయకుడు,

కంచ ఐలయ్యపై టీజీ వ్యాఖ్యలు అనుచితం: తమ్మినేని
సాక్షి, హైదరాబాద్‌:
సామాజికవేత్త, ప్రొఫెసర్‌ కంచ ఐలయ్యపై ఏపీ టీడీపీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. ఐలయ్యను నడిరోడ్డుమీద ఉరితీయాలంటూ టీజీ వెంకటేశ్‌ వ్యాఖ్యానించడం అత్యంత గర్హనీయమని ఒక ప్రకటనలో విమర్శించారు.

సామాజికవేత్తలు, ఉద్యమకారులపట్ల టీడీపీ వైఖరి ఇదేనా అని ప్రశ్నించారు. దీనికి ఆ పార్టీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఐలయ్య రాసిన పుస్తకంపై అభ్యంతరాలు ఉంటే చర్చించవచ్చని కానీ, ఆ విషయాలను వదిలిపెట్టి  ఉరితీయాలని మాట్లాడటం దేనికి సంకేతమని నిలదీశారు. దీనివెనుక ఆర్‌ఎస్‌ఎస్‌ హస్తముందని తమ్మినేని  ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement